అన్వేషించండి

Gnaneswari Kandregula: ఆ ఆలోచనతో చేయలేదు, ప్రేక్షకులు మోసపోయాం అనుకున్నారు - ‘పెళ్లి చూపులు’ షోపై జ్ఞానేశ్వరి కామెంట్స్

Gnaneswari Kandregula: హ్యాండ్‌సమ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్. తను పెళ్లి చూపులు అనే షో అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో విన్నర్ అయిన జ్ఞానేశ్వరి.. తాజాగా దీనిపై స్పందించింది.

Gnaneswari Kandregula about Pelli Choopulu: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమల్లో కొందరే తెలుగమ్మాయిలు ఉన్నారు. అందులో జ్ఞానేశ్వరి కాండ్రేగుల కూడా ఒకరు. ముందుగా ప్రదీప్ పెళ్లిచూపులు అనే టీవీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది జ్ఞానేశ్వరి. అందులో విన్నర్‌గా నిలిచి.. యాంకర్ ప్రదీప్‌ను పెళ్లి కూడా చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ షో ముగిసిన తర్వాత దాని మేకర్స్‌కు ఎన్నో లీగల్ సమస్యలు ఎదురయ్యాయి. అప్పటినుండి ఇప్పటివరకు ప్రదీప్ పెళ్లి అనే మాటే మళ్లీ వినిపించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్ఞానేశ్వరి.. ఈ షో గురించి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంది. 

అది చాలా డిఫరెంట్..

ప్రదీప్ పెళ్లిచూపులు అనే ప్రోగ్రామ్.. తన కెరీర్‌కు సహాయపడిందా లేదా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది జ్ఞానేశ్వరి. ‘‘అది ఒక డిఫరెంట్ జర్నీ. దాని నుండి వచ్చిన తర్వాత నేను చేస్తుంది చాలా డిఫరెంట్. ముందు ఒక ప్రపంచాన్ని చూసి తర్వాత వేరే ప్రపంచానికి అలవాటు పడాలంటే చాలా కష్టం. మంచా చెడా అని పక్కన పెడితే అది నా కెరీర్‌లో భాగమే. ప్రేక్షకులు నన్ను తెలుసుకోవాలనే ఆలోచనతో నేను ఆ ప్రోగ్రాం చేయలేదు. నేను అందులో ఎందుకు పాల్గొన్నానో అది వేరే కథ. అది అయ్యాకే తెలిసింది జనాలు మనల్ని చూస్తారు, ప్రేమిస్తారు, ద్వేషిస్తారు అని. దాని వల్ల 90 శాతం నేను ప్రేమనే చూశాను. ఆ 10 శాతం కూడా కోపం కాదు. ప్రేక్షకులకు మోసపోయామన్న ఫీలింగ్ వచ్చింది’’ అంటూ ప్రోగ్రామ్ గురించి వివరణ ఇచ్చింది జ్ఞానేశ్వరి.

అంతా ఫన్..

తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘దూత’ అనే సిరీస్‌లో జ్ఞానేశ్వరి కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లో పనిచేయడం ఇదే మొదటిసారి అని, షూటింగ్ అంతా ఫన్‌గా గడిచిందని బయటపెట్టింది. ఏదైనా పాత్రలో నటిస్తున్నప్పుడు దాని గురించి దర్శకుడిని వివరంగా అడిగి తెలుసుకుంటానని చెప్పుకొచ్చింది. ‘దూత’లో చేస్తున్న సమయంలో నాగచైతన్య గురించి చాలా తెలుసుకున్నానని, తన నుండి చాలా నేర్చుకున్నానని తెలిపింది జ్ఞానేశ్వరి. ఒక సీన్‌లో తను నవ్వేసినా కూడా చైతూ ఆగిపోలేదని గుర్తుచేసుకుంది. ఒకరోజు ఒక గంట సెట్‌కు లేట్‌గా వెళ్లానని, అప్పటికే అందరూ రెడీగా ఉన్నా కూడా తనపై ఎవరూ కోప్పడలేదని చెప్పింది. పైగా సెట్స్‌లో తను ఎక్స్‌ట్రోవర్ట్ అని బయటపెట్టింది. 

వాళ్ల ఛాయిస్ వేరే అయ్యిండొచ్చు..

తెలుగమ్మాయిలకు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంపై జ్ఞానేశ్వరి స్పందించింది. ‘‘ఎవరికి ఇది ఎంత కష్టమో నాకు తెలియదు. ఎవరెవరి కష్టం వారికి ఉంటుంది. తెలుగమ్మాయిలు రావట్లేదని ఇన్నాళ్లు మనం విన్నాం. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాళ్ల ఛాయిస్, కంఫర్ట్ వేరే అయ్యిండొచ్చు. ప్రస్తుతం ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే.. ఎవరు తెలుగు, ఎలా కాదు అని కూడా చెప్పలేరు. చాలామందికి నేను చెప్పిన తర్వాత కూడా ఇంకా డౌట్ నేను తెలుగమ్మాయా కాదా అని. వెస్టర్న్ కల్చర్‌కు అలవాటు పడిన తర్వాత ఎవరు ఎక్కడ నుండి వచ్చారని మనం చెప్పలేం. దీన్నిబట్టి చూస్తే అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి’’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది జ్ఞానేశ్వరి. అంతే కాకుండా సోషల్ మీడియా అనేది యాక్టర్స్ అవ్వడానికి ఈజీ మార్గం అయిపోయిందని కూడా తెలిపింది.

Also Read: మాజీ విశ్వసుందరి ఐశ్వర్యపై కంగనా ఊహించని కామెంట్స్‌ - షాకవుతున్న నెటిజన్లు

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget