By: ABP Desam | Updated at : 25 Mar 2023 06:27 PM (IST)
ఘంటాడి కృష్ణ... 'రిస్క్' సినిమాలో హీరో హీరోయిన్లు
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ (Ghantadi Krishna) నవ తరం, యువతరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. అయితే, 'దేవుడు వరం అందిస్తే నేనిన్నే కోరుకుంటాలే' పాట ఏదో ఒక సమయంలో వినే ఉంటారు. ఆ పాటకు, 'సిక్స్ టీన్స్' సినిమాకు సంగీతం అందించినది ఆయనే. ఇప్పుడు ఆయన దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
రిస్క్... సిక్స్ టీన్స్ సీక్వెల్!
ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు జికె మిరకిల్స్ పతాకంగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన సినిమా 'రిస్క్'. సందీప్ అశ్వా హీరోగా నటించారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రూపొందించారు. 'సిక్స్ టీన్స్'కు సంగీతం అందించిన ఘంటాడి కృష్ణ, ఆ సినిమాకు సీక్వెల్ గా 'రిస్క్'ను తెరకెక్కించారు. ఇందులో తొలి పాటను తాజాగా విడుదల చేశారు. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని ఘంటాడి కృష్ణ తెలిపారు.
సిద్ శ్రీరామ్ పాడిన 'సొగసుకే సోకు'
'రిస్క్' సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తొలి పాట లవ్లీ రొమాంటిక్ మెలోడీ 'సొగసుకే సోకు'ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తెలుగులో ఆయన పాడగా... హిందీ వెర్షన్ 'ఇత్ని ఖూబ్ సూరత్'ను మహమ్మద్ హైమత్, తమిళ్ వెర్షన్ 'అజ్హ్హగుకే అజ్హ్హగూట్టన్'ను అర్జున్ విజయ్, కన్నడ వెర్షన్ 'సొగసిగే మెరుగు'ను సింగర్ సిద్ధార్థ్ బేలమన్ను పాడారు.
తెలుగు పాటను లెజెండరీ దర్శక నిర్మాత ఎం.ఎస్. రాజు విడుదల చేశారు. ఆ తర్వాత అయన మాట్లాడుతూ ''ఘంటాడి కృష్ణ మొదట్లో మంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్లకు సంగీతానికి పరిమితం కాకుండా దర్శక నిర్మాతగా రిస్క్ చేసాడు. పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో ఘంటాడి కృష్ణ తప్పక విజయం సాధిస్తాడని అనుకుంటున్నాను" అని అన్నారు. తెలుగు మోషన్ పోస్టర్ విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ మాట్లాడుతూ ''నేను కాలేజీలో చదువుతున్నప్పుడు 'దేవుడు వరమందిస్తే...' పాట విన్నా. ఆడియో సీడీల్లో మళ్ళీ మళ్ళీ వినేవాడిని. ఈ రోజు విడుదలైన పాటలో సంగీతం, సాహిత్యం, ఛాయాగ్రహణం బావున్నాయి. ఘంటాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వాలు పాన్ ఇండియా సక్సెస్కో కావాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
Also Read : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?
''నేను 'సిక్స్ టీన్స్'కు కొనసాగింపుగా సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నాను. ఇదొక క్రైమ్ థ్రిల్లర్" అని ఘంటాడి కృష్ణ అన్నారు. ''సినిమా పోస్టర్ మీద హీరోగా నన్ను చూసుకోవాలనేది నా కల. దానిని నిజం చేసిన ఘంటాడి కృష్ణ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. పాట ఎంత బావుందో, సినిమా కూడా అంతే బావుంటుంది'' అని హీరో సందీప్ అశ్వా అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఆదిత్య ఓం, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం రామకృష్ణ రావు, సామాజిక వేత్త దుండ్ర కుమార స్వామి, రావి సురేష్ రెడ్డి, గడ్డం రవి, విజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Also Read : చావడానికి అయినా సిద్ధమే - విష్ణుతో గొడవపై ఓపెన్ అయిన మనోజ్
సందీప్ అశ్వా, సానియా ఠాకూర్, జోయా ఝవేరి, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్ , విశ్వేష్, అనీష్ కురువిళ్ళ, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకు కళా దర్శకత్వం : మురళి, కూర్పు : శివ శార్వాణి, పోరాటాలు : శంకర్ మాస్టర్, ఛాయాగ్రహణం : జగదీశ్ కొమరి, నిర్మాణ సహకారం : గడ్డం రవి, నిర్మాణ పర్వేక్షణ : రావి సురేష్ రెడ్డి, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం : ఘంటాడి కృష్ణ.
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు