అన్వేషించండి

Ghaati Release Date: ‘ఘాటి’ మాములు అనౌన్స్‌మెంట్ కాదిది... క్రిష్ కూడా అప్డేట్ అయ్యాడుగా

‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత మరోసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించేందుకు క్వీన్ అనుష్క ‘ఘాటి’ సినిమాతో రెడీ అవుతోంది. ఆదివారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ.. మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో

చాలా గ్యాప్ తర్వాత క్వీన్ అనుష్క శెట్టి నటించిన చిత్రం ‘ఘాటి’. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఇది. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో వినూత్నమైన పాత్రలో కనిపించిన అనుష్క.. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లు సైలెంట్ అయింది. రీసెంట్‌గా ఆమె ‘ఘాటి’ అనే సినిమా చేస్తున్నట్లుగా న్యూస్ బయటికి వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత అలాంటి మరో పవర్ ఫుల్‌ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అనుష్క ‘ఘాటి’తో సిద్ధమవుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, ఆ తర్వాత క్వీన్ అనుష్క ఫెరోషియస్ అవతార్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన స్పైన్ -చిల్లింగ్ గ్లింప్స్.. సినిమాపై ఎటువంటి అంచనాలను పెంచాయో తెలియంది కాదు. ముఖ్యంగా ‘భాగమతి’ వైబ్‌ని మరోసారి పరిచయం చేశాయి. ఇప్పుడు మరో థ్రిల్లింగ్ అనౌన్స్‌మెంట్‌తో ‘ఘాటి’ టీమ్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇది అలాంటిలాంటి సర్‌ప్రైజ్ కాదు.

‘ఘాటి’ రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. అవడానికి ఇది రిలీజ్ డేట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంటే అయినప్పటికీ.. ఇందులో సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉండటం విశేషం. అదేంటంటే.. ఇప్పటి వరకు యంగ్ డైరెక్టర్స్ వారి సినిమాల ప్రమోషన్స్ విషయంలో వినూత్నంగా ఆలోచిస్తూ.. రిలీజ్ కంటే ముందు కొన్ని స్పెషల్ ట్రీట్‌‌లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారి జాబితాలోకి క్రిష్ కూడా చేరారు. ఇంకా చెప్పాలంటే క్రిష్ కూడా అప్డేట్ అయ్యాడనేలా.. ఈ వీడియో ఉంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే...

Also Read: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో

దర్శకుడు క్రిష్, ఎడిటర్‌తో కూర్చోని ‘ఘాటి’ సాంగ్‌ని ఎడిట్ చేయిస్తున్నారు. అదే సమయంలో నిర్మాతలు వంశీ, రాజీవ్ అక్కడకు రావడంతో.. రండి.. మళ్లీ ఆ సాంగ్‌ని మొదటి నుండి ప్లే చేయండి అని క్రిష్ ఎడిటర్‌గా చెబితే.. ‘ఆ సాంగ్ కాదు కానీ.. ఫైనల్ కాపీ ఎప్పుడిస్తున్నారు క్రిష్’ అంటూ నిర్మాతలు అడిగితే.. ‘అదేంటి.. ఇప్పుడేగా సాంగ్ ఎడిట్ చేస్తుంది.. నాకు ఇంకా మూడు నెలలు టైమ్ కావాలి’ అని క్రిష్ నిర్మాతలకు కుండబద్దలయ్యేలా చెప్పేశాడు. అయితే నిర్మాతలు ‘మూడు కాదు.. నాలుగు నెలలు తీసుకోండి బ్రో. కానీ చెప్పిన టైమ్‌కి పర్ఫెక్ట్‌గా ఇచ్చేయండి’ అని అనగానే క్రిష్ పకాపకా నవ్వేశాడు. నాలుగు నెలలు అంటున్నారు.. మీరేమైనా రిలీజ్ డేట్‌ని ఫిక్స్ అయ్యారా? ఏంటి అని క్రిష్ ఎగ్జయిట్ అవుతూ అడుగుతుంటే.. సడెన్‌గా అనుష్క ప్రత్యక్షమై.. ‘ఏప్రిల్ 18’ అని చెప్పేసింది.

Also Readఅల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?

నిజంగా ఇది మేకర్స్ నుండి అనుష్క అభిమానులకు వచ్చిన ట్రీట్‌గానే భావించాలి. అలాగే క్రిష్ సినిమాలకు ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయడం చూస్తుంటే.. ‘ఘాటి’ సక్సెస్‌పై టీమ్ అంతా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందనేది స్పష్టమవుతోంది. ఈ వీడియోలో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ తర్వాత మరోసారి గ్లింప్స్ సన్నివేశాలను పరిచయం చేశారు. అనుష్క బస్సులోకి ఎంటరై ఒక వ్యక్తి మెడను నరికి అద్దంలో తనను తాను చూసుకోవడం.. అతని మెడ నరికిన తర్వాత, రక్తం చిందే తలని పట్టుకొని నడుస్తూ, ఆపై పొగ తాగుతున్నట్లు కనిపించిన విజువల్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఆ ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ‘ఘాటి’ ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సన్నాహాలు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Embed widget