అన్వేషించండి

Gangs of Godavari Collections:‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - విశ్వక్ మూవీ గట్టెక్కినట్లేనా?

Gangs of Godavari Day 3 Collections: యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన మాస్ కమర్షియల్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది.

Gangs of Godavari Day 3 Box Office Collections: మామూలుగా ప్రతీ ఏడాది సమ్మర్‌లో సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎందరో స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను విడుదల చేయడానికి సంక్రాంతినే ఎంచుకుంటారు. కానీ ఈసారి మాత్రం సమ్మర్ అంతా పెద్దగా సినిమాలు లేకుండా మూవీ లవర్స్ అంతా బోరింగ్‌గా ఫీలయ్యారు. అలాంటి సమయంలోనే ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీనికి పోటీగా మరో రెండు చిత్రాలు విడుదలయినా కూడా ప్రేక్షకులు ఎక్కువగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూడడడానికే ఇష్టపడుతుండడంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నట్టు తెలుస్తోంది.

కలెక్షన్స్ ఎంతంటే?

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలయ్యి మొదటి వీకెండ్ పూర్తయ్యే సమయానికి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అని మూవీ నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బయటపెట్టింది. విడుదలయిన మూడు రోజులకే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ప్రకటించింది. మొదటిరోజే రూ.8.2 కోట్ల కలెక్షన్స్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ ఇచ్చింది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాకు పోటీగా ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ హీరోగా ‘భజే వాయు వేగం’ సినిమాలు వచ్చినా కూడా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ను చూడడానికే ఎక్కువగా ప్రేక్షకులు ముందుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

పాజిటివ్ రివ్యూలు..

గోదావరి జిల్లాల్లో జరిగే కుల రాజకీయాల ఆధారంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ చైతన్య. టైగర్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలావరకు ఈ మూవీలో బోర్ కొట్టినట్టు అనిపించిన ప్రతీసారి విశ్వక్ నటనే సినిమాను ముందుకు తీసుకెళ్లిందని ఫ్యాన్స్.. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక రత్నాకర్ భార్యగా బుజ్జి పాత్రలో నేహా శెట్టి గ్లామర్, రత్నమాల పాత్రలో అంజలి యాక్టింగ్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. యూత్‌ఫుల్ కథలు మాత్రమే కాదు.. కమర్షియల్ చిత్రాలు కూడా విశ్వక్ సేన్‌కు బాగా వర్కవుట్ అవుతాయని ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి నిరూపించింది.

ఫ్యాన్స్‌లో జోష్..

కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లో కూడా తన సత్తా చాటుతోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఓవర్సీస్‌లో 200 వేల డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ మూవీ. ఓవర్సీస్‌లో ఉన్న మూవీ లవర్స్‌లో సైతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ జోష్‌ను నింపిందని ఫ్యాన్స్ అంటున్నారు. నాగవంశీ నిర్మించిన ఈ మూవీ.. చాలాసార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ముందుగా డిసెంబర్‌లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల అవుతుందని విశ్వక్ ప్రకటించాడు. ఆ తర్వాత మార్చిలో సినిమా వస్తుందని అన్నాడు. కానీ ఫైనల్‌గా మేలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

Also Read: నటుడి బ్యాగులో బుల్లెట్ల కలకలం - తనిఖీల్లో బయటపడ్డ 40 బుల్లెట్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GITAM Lands: విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
Ratha Saptami 2026: తిరుమలలో వైభవంగా రథసప్తమి.. సూర్యప్రభవాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం
తిరుమలలో వైభవంగా రథసప్తమి.. సూర్యప్రభవాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం
KTR Issues Legal Notice: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. నెక్ట్స్ ఏంటీ?
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. నెక్ట్స్ ఏంటీ?
Dhanush Mrunal Thakur : ధనుష్, మృణాల్ పెళ్లి చేసేశారు? - అతిథులుగా స్టార్ హీరోస్... మరీ ఇలా ఉన్నారేంట్రా!
ధనుష్, మృణాల్ పెళ్లి చేసేశారు? - అతిథులుగా స్టార్ హీరోస్... మరీ ఇలా ఉన్నారేంట్రా!

వీడియోలు

Adivasi Kikri String Instrument | అరుదైన గిరిజన సంగీత వాయిద్య పరికరం కిక్రీ | ABP Desam
Sanju Samson Failures vs NZ | కివీస్ తో రెండో టీ20 లోనూ ఫెయిలైన సంజూ శాంసన్ | ABP Desam
Mitchell Santner Praises Team India | టీమిండియాపై న్యూజిలాండ్ కెప్టెన్ ప్రశంసల జల్లు | ABP Desam
Suryakumar Yadav 82 vs Nz Second T20 | టీ20 వరల్డ్ కప్ కి ముందు శుభవార్త | ABP Desam
Ishan Kishan 76 vs NZ Second T20 | మెరుపు ఇన్నింగ్స్ తో కమ్ బ్యాక్ ఘనంగా చాటుకున్న ఇషాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GITAM Lands: విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
విశాఖ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు గీతం ప్రయత్నం - దోపిడీ అంటున్న విపక్షాలు - అసలు కథ ఇదీ!
Ratha Saptami 2026: తిరుమలలో వైభవంగా రథసప్తమి.. సూర్యప్రభవాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం
తిరుమలలో వైభవంగా రథసప్తమి.. సూర్యప్రభవాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం
KTR Issues Legal Notice: కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. నెక్ట్స్ ఏంటీ?
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. నెక్ట్స్ ఏంటీ?
Dhanush Mrunal Thakur : ధనుష్, మృణాల్ పెళ్లి చేసేశారు? - అతిథులుగా స్టార్ హీరోస్... మరీ ఇలా ఉన్నారేంట్రా!
ధనుష్, మృణాల్ పెళ్లి చేసేశారు? - అతిథులుగా స్టార్ హీరోస్... మరీ ఇలా ఉన్నారేంట్రా!
Kurnool Crime News: కర్నూలులో మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన యువతి! రివెంజ్ కోసం దారుణం
కర్నూలులో మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన యువతి! రివెంజ్ కోసం దారుణం
Pakistan: బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయి... భారత్‌కు హెచ్చరిక
బంగ్లాదేశ్ వైపు కన్నెత్తి చూస్తే పాకిస్తాన్ క్షిపణులు రంగంలోకి దిగుతాయి... భారత్‌కు హెచ్చరిక
మిడ్‌ సైజ్‌ SUVలలో హోరాహోరీ పోటీ - క్రెటాతో పోలిస్తే కొత్త కుషాక్‌ ఏ స్థాయిలో ఉంది?
హ్యుందాయ్‌ క్రెటాకు టఫ్‌ కాంపిటీషన్‌ - 2026 స్కోడా కుషాక్‌ పవర్‌, ఫీచర్లు ఏ రేంజ్‌లో ఉన్నాయి?
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా ఎందుకు తింటారు? బడ్జెట్ లాక్-ఇన్​కి, హల్వా ట్రెడీషన్​కి సంబంధం ఏంటి?
కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా ఎందుకు తింటారు? బడ్జెట్ లాక్-ఇన్​కి, హల్వా ట్రెడీషన్​కి సంబంధం ఏంటి?
Embed widget