అన్వేషించండి

Game Changer Box Office Collection: హిందీలో సండే వరకూ స్టడీగా ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లు - కానీ తర్వాత షాక్ తప్పదా?

Taran Adarsh Game Changer Collections: గేమ్ ఛేంజర్ మూవీ హిందీలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న విడుదలైన డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే హిందీలో మాత్రం... 

Game Changer Hindi Collection: ఎన్నో అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ మూవీ ఈ సంక్రాంతికి థియేటర్లోకి వచ్చింది. ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ స్లో స్లో షూటింగ్ పూర్తి చేసుకుని 2025లో విడుదలైంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ నుంచి వచ్చిన మొదటి సినిమా ఇది. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా రావడం, పైగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కడంతో విడుదలకు ముందు థియేటర్ల ఎదుట పండగ వాతావరణం కనిపించింది. మూవీ ప్రచార పోస్టర్స్, కార్యక్రమాలు మంచి బజ్ పెంచాయి.

థియేటర్ లో సందడి..

అలా భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన గేమ్ ఛేంజర్ మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని ఎరియాల్లో అయితే డిజాస్టర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. తొలి రోజు భారీ ఒపెనింగ్స్ ఇచ్చింది. కానీ డివైడ్ టాక్ రావడంలో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే మెల్లిమెల్లిగా మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెకండ్ డేకి గేమ్ ఛేంజర్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడం మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న గేమ్ ఛేంజర్ హిందీలోనూ మంచి టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. జంజీర్ తో ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయిన చరణ్ యాక్టింగ్ కి హిందీ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

హిందీలో పాజిటివ్ బజ్

ఇక ఆర్ఆర్ఆర్ లో తన పర్ఫామెన్స్ కి హిందీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో చరణ్ కి నార్త్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీకి హిందీలో పాజిటివ్ టాక్ వస్తుంది. ఫస్ట్ డే ఈ సినిమా ఒపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని మూవీ టీంతో పాటు సినీవర్గాలు కూడా అభిప్రాయపడ్డాయి. కానీ, కలెక్షన్స్ లో పెద్దగా మార్పు కనిపించలేదు. భారీ బడ్జెట్ వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు హిందీ సర్క్యూట్స్ లో పాజిటివ్ టాక ఉన్నప్పటికీ గేమ్ ఛేంజర్ దాని పొటెన్షియల్ ని చూపించలేకపోతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్స్ అభిప్రాయపడ్డారు. వీకెండ్ అయినా గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పెరగలేదు, మూడు రోజులు వసూళ్లు స్టడీగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ వేదికగా గేమ్ ఛేంజర్ మూడు రోజుల హిందీ వసూళ్లును వెల్లడించారు. తొలి రోజు (శుక్రవారం) రూ. 8.84 కోట్లు, రెండో రోజు రూ. 8.43 కోట్లు, మూడో రోజు రూ. 9.52 కోట్టు రాబట్టింది. వీకెండ్ తర్వాత కొంచెం డౌన్ అయ్యింది. నెక్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?

హిందీ బాక్సాఫీసు వసూళ్లు ఇలా

ఇలా మొత్తం తొలి వీకెండ్ లో గేమ్ ఛేంజర్ కేవలం రూ. 26.59 కోట్లు మాత్రమే రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇది మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు ఈ సినిమా రూ. 186 పైగా కోట్ల గ్రాస్ తో భారీ ఓపెనింగ్ ఇచ్చింది. కానీ అదే జోరుని మాత్రం గేమ్  ఛేంజర్ కొనసాగించలేకపోతుంది. వీకెండ్ అయినా థియేటర్లో ఆడియన్స్ పెద్దగా కనిపించలేదు. పైగా నిన్న డాకు మహారాజ్ రిలీజ్ గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించినట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. మూడు విభిన్న షేడ్స్ లో నటించిన రామ్ చరణ్ యాక్టింగ్ కి విమర్శలు ప్రశంసలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ని చరణ్ తన భుజాలపై నడిపంచాడని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. తెలుగు అమ్మాయి అంజలి కీ రోల్ పోషించింది. తమిళ నటుడు ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నటుడు జయరాం, సముద్ర ఖని వంటి నటులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ ని తెరకెక్కించారు. దాదాపు రూ. 450 కోట్ల వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. 

Also Readనవ్వించే ప్రయత్నమే... మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు - అన్షుపై కామెంట్స్‌ & రేవంత్ రెడ్డి - బన్నీ ఇష్యూలో సారీ చెప్పిన త్రినాథరావు నక్కిన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP DesamRishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Amendment Bill: ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
ఇక నుంచి అవి వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ప్రభుత్వ భూములే- వక్ఫ్ బిల్లులో కీలక అంశాలు
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Shalini Pandey: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
Stalin Letter To PM Modi: డీలిమిటేషన్ వివాదం, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
డీలిమిటేషన్ వివాదం, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
Save HCU: 'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
Nani: నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
Embed widget