అన్వేషించండి

Gama Awards: మూడేళ్ల తర్వాత మూడేళ్లకు ఒకేసారి దుబాయ్‌లో గామా అవార్డ్స్ - ఎప్పుడంటే?

Gama Awards 2024: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా దుబాయ్‌లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సమర్పణలో ఈ ఏడాది ఘనంగా గామా అవార్డ్స్ వేడుకకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం కర్టైన్ రైజర్ ఈవెంట్ జరిగింది.

''ఇంతకు ముందు అంగరంగ వైభవంగా నిర్వహించిన గామా అవార్డ్స్ (Gama Awards)కు అద్భుతమైన స్పందన లభించింది. మధ్యలో మూడేళ్ల పాటు కరోనా మహమ్మారి విజృంభణ, ఇతర కారణాలతో కేసరి త్రిమూర్తులు గారు వేడుకలను నిర్వహించలేకపోయారు. ఈసారి తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు'' అని సీనియర్ సంగీత దర్శకులు కోటి తెలిపారు. గామా అవార్డ్స్ జ్యూరీ కమిటీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు.

కరోనా కారణంగా ప్రపంచం అంతా కొన్నాళ్లు లాక్‌డౌన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ విపత్తు కంటే... 2012 కంటే ముందు మూడేళ్ల పాటు అవార్డు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గామా 4వ ఎడిషన్ అవార్డులను మార్చి 3న దుబాయ్‌లో జబిల్ పార్క్ (zabeel park in dubai)లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సారథ్యంలో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులు ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కోటితో పాటు జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ ట్రోఫీ ఆవిష్కరించారు. 

మూడేళ్ల తర్వాత నిర్వహిస్తున్న గామా అవార్డుల వేడుకలో మూడేళ్లకు... 2021, 2022, 2023లో విడుదలైన సినిమాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు ఇవ్వనున్నారు. గామా అవార్డ్స్ జ్యూరీ సభ్హ్యులు, ప్రముఖ దర్శకులు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ... "కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. నిజాయతీగా అవార్డులు ఇవ్వబోతున్నాం" అని చెప్పారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ... "గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిమూర్తులు ఇటువంటి వేడుకను నిర్వహించడం చాలా సంతోషం" అన్నారు. సంగీత దర్శకులు రఘు కుంచె మాట్లాడుతూ... "దేశం కాని దేశంలో తెలుగువారు గర్వపడేలా అవార్డ్స్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఒక తెలుగు వాడిగా గర్విస్తున్నా" అని చెప్పారు.

స్టార్ హీరోలు అందర్నీ ఆహ్వానించాం : సౌరభ్! 
గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ... "దుబాయ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ ప్రేమికుల మధ్యలో ప్రతిష్టాత్మకంగా వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. జాతీయ పురస్కార గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సహా తెలుగు సినిమా ప్రముఖుల అందర్నీ వేడుకకు ఆహ్వానించాం. మేం ఈ అవార్డులు స్థాపించినప్పటి నుంచి మాకు సహాయ, సహకారాలు అందిస్తూ... మా కార్యక్రమం ప్రసారం చేస్తున్న ఈటీవీ యాజమాన్యానికి థాంక్స్'' అని చెప్పారు. ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలుగు సినిమా దర్శకుల వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ అన్నారు.

Also Read: సుందరం మాస్టర్ రివ్యూ : హర్ష చెముడు సినిమా హిట్టా? ఫట్టా?

గాయకుడు మనోకి ఎస్పీబీ గోల్డెన్ వాయిస్!
ఆస్కార్ పురస్కార విజేతలు ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌... ఇద్దరినీ 'గామా గౌరవ్ సత్కార్' అవార్డుతో సత్కరించనున్నట్లు... అలాగే, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా 'గామా ఎస్పీబీ గోల్డెన్ వాయిస్' అవార్డును గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు.

Also Readసిద్ధార్థ రాయ్ రివ్యూ: అర్జున్ రెడ్డి, యానిమల్ టైపులో ఉందా? దర్శకుడు అలా తీశాడా? లేదా? బోల్డ్ సీన్లు ఎలా ఉన్నాయ్?

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget