అన్వేషించండి

సౌత్ స్టార్స్‌ ఉంటేనే సంపూర్ణం - దక్షిణాది హీరోలతో చేతులు కలుపుతున్న బాలీవుడ్ తారలు వీరే, కొత్త ట్రెండ్‌కు శ్రీకారం

పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైన తర్వాత బాలీవుడ్ స్టార్స్ సౌత్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సైఫ్, అజయ్ దేవగన్ వంటి హిందీ నటులు తెలుగు చిత్రాల్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు.

పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలైన తర్వాత భారతీయ సినిమాలో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ సైతం దక్షిణాది భాషల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. విలన్ రోల్స్ చేయటానికి కూడా రెడీ అవుతున్నారు. అంతేకాదు, బాలీవుడ్ సినిమాల్లో సైతం మన హీరోలను పెట్టుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్స్, ఏయే సినిమాల్లో మన స్టార్స్‌‌తో నటిస్తున్నారో చూద్దాం. 

సైఫ్ అలీ ఖాన్:

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రెండు సౌత్ సినిమాల్లో విలన్స్ గా నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' చిత్రంలో సైఫ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ పౌరాణిక డ్రామాలో ప్రతి నాయకుడు లంకేశ్ పాత్రలో సైఫ్ కనిపించనున్నారు. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కే NTR30 సినిమాలోనూ హిందీ స్టార్ భాగం అవుతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

హృతిక్ రోషన్:

ఇప్పటి వరకూ డబ్బింగ్ చిత్రాలతో సౌత్ ఆడియన్స్ ను అలరించిన హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్.. త్వరలో సౌత్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. హృతిక్ నటించిన 'వార్' సినిమాకు సీక్వెల్ గా రానున్న 'వార్ 2' చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ రూపొందించే స్పై యూనివర్స్ లో తారక్ కూడా చేరబోతున్నాడు. హృతిక్, తారక్ లతో తెలుగు, హిందీ భాషల్లో 'వార్ 2'‌ను తెరకెక్కించే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు ఉన్నారు. 

సంజయ్ దత్:

పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన 'KGF 2' సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అధీరా వంటి పవర్ ఫుల్ రోల్ లో సీనియర్ నటుడు అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినషన్ లో తెరకెక్కుతున్న 'లియో' సినిమాలో సంజూ భాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. గతంలో చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ గెస్ట్ రోల్ లో కనిపించాడు.

సల్మాన్ ఖాన్:

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ స్పెషల్ క్యారెక్టర్ పోషించాడు. సౌత్ బ్యాక్ డ్రాప్ లో ఆయన నటించిన 'కిసీ కీ భాయ్ కీసీ కా జాన్' సినిమా ఈద్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించగా.. రామ్ చరణ్ ఓ సాంగ్ లో మెరవనున్నాడు. 

అజయ్ దేవగన్:

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రామ్ చరణ్ తండ్రిగా నటించారు. ఆయన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, కథలో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు. తన గ్రిప్పింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని, సినిమా విజయంలో భాగం పంచుకున్నారు. 

బాబీ డియోల్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాతో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పీరియాడికల్ అడ్వెంచర్ యాక్షన్ మూవీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ కనిపించనున్నారు. ముందుగా ఈ క్యారక్టర్ కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. అయితే డేట్స్ సమస్య కారణంగా రామ్ పాల్ తప్పుకోవడంతో.. ఆయన స్థానంలోకి బాబీ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

అర్జున్ రాంపాల్:

పవన్ కల్యాణ్ సినిమా వదులుకున్న అర్జున్ రాంపాల్.. బాలయ్య సినిమాతో తెలుగులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న NBK108 చిత్రంలో రాంపాల్ ని మెయిన్ విలన్ గా ఎంపిక చేసినట్లుగా టాక్ నడుస్తోంది. 

డినో మోరియా:

రాజ్, అక్సర్ వంటి హిందీ చిత్రాలతో పాపులర్ అయిన బాలీవుడ్ సనటుడు డినో మోరియా కూడా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. యూత్ స్టార్ అఖిల్ అక్కినేని నటించిన పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్' లో డియో విలన్ గా నటించాడు. ఏప్రిల్ 28న ఈ స్పై థ్రిల్లర్ రిలీజ్ కాబోతుంది.

అప్పుడు దక్షిణాది స్టార్లు, ఇప్పుడు బాలీవుడ్ తారలు

దక్షిణాది, ఉత్తరాది నటీనటులు కలిసి నటించడం కొత్తేమీ కాదు. ఈ ట్రెండ్ ఒకప్పుడు కూడా ఉండేది. అయితే, బాలీవుడ్ నటుల్లో హీరోయిన్లు మినహా.. పెద్ద హీరోలు ఎవరూ దక్షిణాది వైపు కన్నెత్తి చూసేవారు కాదు. మన స్టార్ హీరోలే బాలీవుడ్ వైపు చూసేవారు. రజినీకాంత్, కమల్ హాసన్‌లు అక్కడి స్టార్ హీరోలతో కలిసి నటించారు. దక్షిణాది సినిమాలకు మంచి ఆధరణ లభిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారు. కేవలం ‘బాలీవుడ్’గా కాకుండా ఇండియన్ సినిమాగా తమ చిత్రాలు ప్రేక్షకుల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇది ఒకింత మంచి సాంప్రదాయమే. 

Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Embed widget