Ram Charan News: రామ్ చరణ్ రియల్ హీరో - మెగా హీరోపై ఫ్రెంచ్ నటుడు బ్రావో ప్రశంసలు
French Actor Praises Ramcharan | ఫ్రెంచ్ నటుడు నికోలస్ బ్రావో రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించాడు. తన మూవీ "Emily In Paris" ప్రమోషన్‌లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
French Actor Bravo Praises Ramcharan Action | ప్రముఖ ఫ్రెంచ్ నటుడు లూకాస్ నికోలస్ బ్రావో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్రావో నటించిన ఎమిలీ ఇన్ పారిస్ చిత్రం నాలుగో సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇండియన్ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ఫిదా అయినట్టు చెప్పాడు. ఆయన నటించిన కొన్ని సన్నివేశాలను ఊపిరి బిగబట్టి చూశానని చెప్పుకొచ్చారు.
"RRR చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, పోలీస్ అధికారిగా ఆయన చేసిన పాత్రలతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో తెలంగాణ గోండు వీరుడు కోమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించారు. రెండు పార్టుల్లో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 1200 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాకుండా బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినిమా పవర్‌ను ప్రపంచస్థాయిలో చాటి చెప్పింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాతో తనపై అంచనాలను పెంచుకుంటూ పోతున్నారు. రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. గ్రామంలో ఉండే చెవిటి వాడి పాత్రలో నటించి సగటు ప్రేక్షకులను మెప్పించారు. వైవిధ్యంగా ఉండే పాత్రల ఎంపికతో రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో మొదలైన సినీ ప్రస్థానం ఇప్పుడు ప్రపంచస్థాయి నటుడిగా తనను తాను మార్చుకుంటూ ముందుకుసాగుతున్నారు. తండ్రి చిరంజీవి నట వారసత్వాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకునిపోవడంలో రామ్ చరణ్ సక్సెస్ అయ్యారు.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తైంది. వీటితోపాటు మరో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతోపాటు, సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నారు. లూకాస్ బ్రావో ప్రశంసలతో రామ్ చరణ్ నటనపై మళ్లీ చర్చ మొదలైంది. అభిమానుల్లో మాత్రం హీరోల సినిమా సినిమాకి అంచనాలు పెరిగి పోతున్నాయి. దాంతో త్వరలో రాబోతున్న గేమ ఛేంజర్ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అసలే రామ్ చరణ్, శంకర్ దర్శకత్వం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఈ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే రామ్‌చరన్- సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో చరణ్ కు విమర్శకుల నుంచి ఎక్కువగా ప్రశంసలు అందుకున్నారు. అదేసినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబుతోనూ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారు. దీంతో రాబోయే రెండేళ్లు క్రేజీ ప్రాజెక్టులతో రామ్ చరణ్ బిజీబిజీగా ఉండబోతున్నారు.