Fish Venkat: ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ సాయం! - బిగ్ ట్విస్ట్... ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారంటే?
Prabhas Help To Fish Venkat: కమెడియన్ ఫిష్ వెంకట్ వైద్యానికి ప్రభాస్ సాయం అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... అది నిజం కాదని, ఎవరో ఫేక్ కాల్ చేశారని వెంకట్ భార్య, కుమార్తె తెలిపారు.

Fish Venkat Family Clarifies On Prabhas Help: కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయని... ఆపరేషన్‌కు సాయం చేయలంటూ కుమార్తె స్రవంతి వేడుకున్నారు. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటుండగా... వెంకట్ దీన స్థితి చూసి ప్రభాస్ సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై వెంకట్ భార్య సువర్ణ, ఫ్యామిలీ మెంబర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ సాయం అందించారన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ప్రభాస్‌కు ఈ విషయం తెలియకపోవచ్చని... తెలిస్తే తప్పకుండా సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి మాకు కాల్ వచ్చిన మాట నిజమే. ఆపరేషన్‌కు కావాల్సినంత సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఇదంతా ఫేక్ న్యూస్. ప్రభాస్ డబ్బు ఇస్తే ఇచ్చామనే చెప్తాం. హీరోలు సాయం చేస్తే బాగుండు. మా ఇల్లు అమ్మి ఆపరేషన్ చేద్దామన్నా ఆ డబ్బు దేనికీ సరిపోదు.' అంటూ సువర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: అనుష్క 'ఘాటీ' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
ప్రభాస్ టీం అంటూ కాల్...
ఫిష్ వెంకట్ కుమార్తె సైతం దీనిపై స్పందించారు. ప్రభాస్ పీఏ అంటూ 5 రోజుల క్రితం ఫోన్ కాల్ వచ్చిందని... తాను నాన్న పరిస్థితి వివరించినట్లు చెప్పారు. 'ప్రభాస్ సర్ షూటింగ్‌లో ఉన్నారు. కాసేపయ్యాక తిరిగి కాల్ చేస్తామని చెప్పారు. రెండు రోజుల నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ప్రభాస్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సాయం రాలేదు. ఎవరైనా సాయం అందించినా మేమే తెలియజేస్తాం.' అంటూ స్రవంతి క్లారిటీ ఇచ్చారు.
వెంకట్ ఫ్యామిలీకి ఎవరో ఫేక్ కాల్ చేశారని తెలుస్తోంది. ఆపదలో ఉన్న వారికి ఇలాంటి ఫేక్ కాల్స్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఇండస్ట్రీలో ప్రముఖులు, సెలబ్రిటీలు తమకు సాయం చేయాలని వెంకట్ ఫ్యామిలీ కోరుతున్నారు.
కిడ్నీలు ఫెయిల్
కమెడియన్ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పాడైపోగా... కొన్నేళ్లుగా డయాలసిస్ చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి విషమంగా మారడంతో కిడ్నీలు మార్పిడి చేయాల్సి ఉంది. కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్నట్లు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
దాతలు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు స్రవంతి. 'ప్రస్తుతం కిడ్నీ డోనర్ కోసం ఎదురుచూస్తున్నాం. నా తండ్రి గ్రూప్ రక్తంతో మ్యాచ్ అయ్యే దాతలు కోసం చూస్తున్నాం. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కిడ్నీ దాతల కోసం డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం' అని చెప్పారు.
ఫిష్ వెంకట్ విలన్, కమెడియన్ రోల్స్‌లో అలరించారు. గబ్బర్ సింగ్, బన్నీ, దిల్, నాయక్, డీజే టిల్లు, అత్తారింటికి దారేది, ఢీ, అదుర్స్, మిరపకాయ్, ఆడో రకం ఈడో రకం, ఖైదీ నెం.150, ఆహా ఓటీటీలో వచ్చిన 'కాఫీ విత్ కిల్లర్', 'మా వింత గాధ వినుమా' వంటి మూవీస్‌లో నటించారు.






















