Ghaati: అనుష్క 'ఘాటి' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
Anushka Shetty: అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ డైరెక్షన్‌లో వస్తోన్న 'ఘాటి' మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Anushka's Ghaati Movie Release Pushed: స్వీటీ అనుష్క ఫ్యాన్స్‌కు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. ఆమె ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న 'ఘాటి' మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 11న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా వేశారు.
అసలు రీజన్ ఏంటంటే?
ఈ మూవీలో వీఎఫ్ఎక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని... అవి పూర్తి కాకపోవడం వల్లే సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్లే విడుదల వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది. 'ఘాటీ' వాయిదాను కన్ఫర్మ్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది.
#Ghaati postponed again!#AnushkaShetty #Krish #VikramPrabhu #KrishJagarlamudi pic.twitter.com/xgUB7p7amO
— ABP Desam (@ABPDesam) July 5, 2025
Also Read: ఐ ఫోన్లు... డబ్బుల వర్షం... థియేటర్లలో తొక్కిసలాట జరిగితే బాధ్యత ఎవరిది?
మేకర్స్ ఏం చెప్పారంటే?
'ఘాటి' అనేది ఒక సజీవ నది లాంటిదని కొన్నిసార్లు మందుకు పరిగెడుతుందని... కొన్నిసార్లు లోతును సేకరించడానికి ఆగిపోతుందని చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. 'ఘాటి కేవలం ఓ సినిమా మాత్రమే కాదు. ఇది ఓ పర్వత ప్రతిధ్వని, అడవి గాలి, రాతి, నేల నుంచి వచ్చిన ఓ స్టోరీ. ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేలా... ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మేము శ్రమిస్తున్నాం. అందుకే రిలీజ్ కాస్త ఆలస్యం కానుంది.
ఈ నిరీక్షణ ఘాటి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత గొప్పగా మరపురానిదిగా చేస్తుందని మేము నమ్ముతున్నాం. మీ ప్రేమ, పేషన్స్‌కు ధన్యవాదాలు. మళ్లీ త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తాం.' అంటూ 'X'లో రాసుకొచ్చింది.
Team #GHAATI pic.twitter.com/UhUtWuMR6g
— UV Creations (@UV_Creations) July 5, 2025
డిఫరెంట్ రోల్‌లో
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అనుష్క 'ఘాటి' మూవీలో డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. మోస్ట్ వయలెంట్ లుక్‌లో స్వీటీ భయపెట్టేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇలాంటి రోల్ ఏ హీరోయిన్ చేయలేదని పలు సందర్భాల్లో టీం తెలిపింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా... యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయగా... నాగవెల్లి విద్యా సాగర్ మ్యూజిక్ అందించారు.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ తర్వాత అనుష్క నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో స్వీటీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజ్ అందుకున్న అనుష్క డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. 'వేదం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రిష్, అనుష్క కాంబోలో వస్తోన్న రెండో చిత్రం 'ఘాటి'. తొలుత ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారని భావించినా జులైకు వాయిదా పడింది. ఇప్పుడు కూడా అనుకోని కారణాలతో వాయిదా పడింది.





















