అన్వేషించండి

Abhishek bachchan: ఐశ్వర్యతో డివోర్స్ అంటూ రూమర్స్ - అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే

Abhishek bachchan Aishwarya Rai: ఐశ్వర్యతో విడాకులు అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్‌పై అభిషేక్ బచ్చన్ రియాక్ట్ అయ్యారు. అలాంటి ప్రచారం తనపై అంతగా ప్రభావం చూపదన్నారు.

Abhishek Bachchan Reaction On Divorce Rumours With Aishwarya: బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ డివోర్స్ తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అవన్నీ రూమర్స్ అంటూ ఇన్ స్టా వేదికగా పలు సందర్భాల్లో అభిషేక్ క్లారిటీ ఇచ్చారు. అయినా... ప్రచారం మాత్రం ఆగలేదు. దీనిపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు.

అవి మాపై ఇంపాక్ట్ చూపించవు

సోషల్ మీడియా, ఆన్ లైన్ వేదికగా వచ్చే కామెంట్స్, రూమర్స్ తమపై అంతగా ప్రభావం చూపవని అభిషేక్ స్పష్టం చేశారు. 'మా కుటుంబం అంతా వర్క్‌కు సంబంధించి చాలా విషయాలపై చర్చించుకుంటాం. సినీ రంగానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరగడంతో ఎలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. ఎలాంటి విషయాలు వదిలేయాలి అనే దానిపై నాకంటూ ఓ అవగాహన ఉంది. సోషల్ మీడియాలో రూమర్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపించవు.

మా అమ్మ, నా భార్య బయట ప్రపంచం చేసే కామెంట్స్, సోషల్ మీడియా రూమర్స్ మా కుటుంబంలోకి తీసుకురారు. మా ఫ్యామిలీ అంతా సంతోషంగా జీవిస్తున్నాం.' అని అభిషేక్ వెల్లడించారు.

Also Read: డైరెక్టర్ To హీరో - తరుణ్ భాస్కర్ 'ఓం శాంతి శాంతి శాంతి' - రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

ఐశ్వర్యతో పరిచయం అప్పుడే...

తాను ఐశ్వర్యను 1995లో స్విట్జర్లాండ్‌లో ఫస్ట్ టైం కలిశానని... తన తండ్రి నటించిన సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు ఆమెను కలిసినట్లు అభిషేక్ చెప్పారు. బాబీ డియోల్ వల్ల ఐశ్వర్యతో పరిచయం ఏర్పడిందన్నారు. 'బాబీ డియోల్, ఐశ్వర్య ఓ సినిమా షూట్ కోసం అక్కడి వచ్చారు. మేమంతా కలిసి డిన్నర్‌కు వెళ్లాం. ఆ టైంలో ఆమెతో చాలా విషయాలు మాట్లాడాను. తన మాటలు అర్థం కావడం లేదని చాలా రోజుల తర్వాత ఆమె చెప్పారు.' అని అన్నారు.

తన కుమార్తె ఆరాధ్య విషయంలో తామెంతో సంతోషంగా ఉన్నామని అభిషేక్ తెలిపారు. 'ఆరాధ్య... మా కుటుంబ గౌరవం సంతోషం. తనకు ఫోన్ లేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలోనూ అకౌంట్ లేదు. తన వ్యక్తిత్వానికి మేము ఎలాంటి ఇబ్బంది కలిగించాలనుకోలేదు. తనొక అద్భుతమైన మహిళగా అభివృద్ధి చెందుతోంది. ఆ క్రెడిట్ మొత్తం ఐశ్వర్యకే ఇస్తాను.' అని అన్నారు.

ఆ పోస్టుతో...

సోషల్ మీడియాలో ఎప్పుడూ అంత యాక్టివ్‌గా ఉండని అభిషేక్ బచ్చన్ ఇటీవల చేసిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. 'నాకు ఉన్నదంతా ఎంతో ఇష్టమైన వారికి ఇచ్చేశా. జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేయగా దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగింది. ఇదే క్రమంలో మళ్లీ విడాకుల రూమర్స్ హల్చల్ చేశాయి. తనపై వచ్చిన వార్తలన్నింటికీ స్పందిస్తే ఆజ్యం పోసినట్లవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ తెలిపారు. కానీ వాటి వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ బాధ పడుతున్నారని... వాటి గురించి నిజం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే... ఆయన రీసెంట్ మూవీ 'కాళీధర్ లాపత' డైరెక్ట్‌గా 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్  అవుతోంది. మధుమిత ఈ మూవీకి దర్శకత్వం వహించగా... దైవిక్ భాగేలా, జీషన్ ఆయూబ్ కీలక పాత్రలు పోషించారు. అనాథ పిల్లల చుట్టూ ఈ కథ సాగుతుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget