KGF Rocky Bhai Dialogue: శుభలేఖపై రాకీ భాయ్ డైలాగ్ - 'కెజియఫ్ 2' క్రేజ్ ఏంది బ్రో? మూమూలుగా లేదుగా
'కెజియఫ్ 2' క్రేజ్ ఎంత ఉందనేది చెప్పడానికి, యశ్ డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శుభలేఖపై 'కెజియఫ్ 2' డైలాగ్ చూసి నెటిజన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు.
KGF 2 movie dialogues Craze: 'కెజియఫ్ 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. భారీ వసూళ్లు సాధిస్తూ పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. హీరో యశ్ డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి. ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాయంటే... ఓ శుభలేఖపై ప్రింట్ చేయించేంత! అవునా? అసలు, ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
KGF 2 Dialogue on Wedding Card: 'వయలెన్స్... వయలెన్స్... ఐ డోంట్ లైక్! ఐ అవాయిడ్! బట్, వయలెన్స్ లైక్స్ మి. ఐ కాంట్ అవాయిడ్!' - 'కెజియఫ్ 2'లో రాకీ భాయ్‌గా యశ్ (Yash) చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా! సినిమా విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లోనూ చూపించారు. సినిమా అభిమాని ఒకరు ఈ డైలాగ్‌ను రీక్రియేట్ చేశారు.
Yash fan recreated the 'Violence' dialogue from KGF2 Movie on his wedding card: 'మ్యారేజ్... మ్యారేజ్... మ్యారేజ్... ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవాయిడ్' (పెళ్లి... పెళ్లి... పెళ్లి... నాకు ఇష్టం లేదు. దాన్నుంచి తప్పించుకుంటున్నాను. కానీ, మా బంధువులకు పెళ్లి అంటే ఇష్టం. తప్పించుకోలేను) అని కర్ణాటకలోని బెల్గావికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు శుభలేఖపై రాశాడు. ఇప్పుడు ఆ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: అంటే నాని నవ్వించాడు, నజ్రియాతో పులిహోర కలిపాడు! 'అంటే సుందరానికి' టీజర్ చూశారా?
ఇక, 'కెజియఫ్ 2' వసూళ్లకు వస్తే... నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 546 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. వెయ్యి కోట్లకు పైగా 'కెజియఫ్ 2' వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.