By: ABP Desam | Updated at : 17 May 2022 07:18 PM (IST)
F3 Song: Life Ante Itta Vundaala
వెంకటేష్, వరుణ్ సందేశ్‌ల ‘F2’ సీక్వెల్ ‘F3’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ‘F3’ నుంచి ఒక్కో అప్‌డేట్ ప్రేక్షకుల్లోకి వదులుతున్నారు. తాజాగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘‘అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల’’ అంటూ సాగే ఈ పాటలో పూజాతో కలిసి వెంకీ, వరుణ్‌లు చిందులేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ సైతం వీరితో కలిసి స్టెప్పులు కలిపారు.
‘‘హాత్ మే పైసా...
మూతి మే సీసా...
పోరితో సల్సా...
రాతిరంతా జల్సా..
అధ్యక్షా... లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా!’’ అంటూ సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. పార్టీ సాంగ్స్‌లో ఇకపై ఈ పాట మారుమోగే అవకాశం ఉంది.
Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్, మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. మే 27న సినిమా విడుదల కానుంది. ‘ఎఫ్2’ సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి హిట్ కొడుతుందని దగ్గుబాటి, మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరి, దర్శకుడు అనిల్ రావిపూడి ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ
Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!
Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!
Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి
Bhishma Combo Repeat: నితిన్, రష్మిక మూవీకి మెగాస్టార్ క్లాప్ - ‘భీష్మ’ త్రయంపై ఫ్యాన్స్ ఆశలు
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల