O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
నయన తార నటించిన ‘O2’ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ మంగళవారం యూట్యూబ్‌లో విడుదల చేసింది.
![O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే! O2 Official Telugu Teaser Watch Nayanthara's O2 Movie Telugu Teaser O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/17/5923c408add59e1a18493dbf9a6326e2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరుస చిత్రాలు, విభిన్న పాత్రలతో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్న నయన తార.. కొత్తగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అయితే, ఈ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల కానుంది. ‘కణ్మనీ రాంబో ఖతీజా’ సినిమాతో నవ్వులు పూయించిన నయన్.. ‘02’(ఓ2) చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని ఈ టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.
‘O2’ చిత్రం.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రిమంగ్ కానుంది. అయితే, రిలీజ్ తేదీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇక టీజర్ విషయానికి వస్తే.. కొచ్చిన్‌కు వెళ్లాల్సిన బస్సు మధ్య దారిలో మిస్సవుతుంది. పోలీసులు ఆ రహదారి మొత్తం వెతికినా.. ఎక్కడా బస్సు ఆచూకీ లభించదు. అయితే, అది రోడ్డు పక్కన ఉండే ఓ పెద్ద బురద గుంటలో మునిగిపోయి ఉంటుంది. బురదలో చిక్కుకున్న ఓ ప్రయాణికుడు.. గొట్టం సాయంతో తమకు హెల్ప్ చేయాలని అరవడాన్ని టీజర్‌లో చూపించారు.
Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ
ఆ తర్వాతి సీన్‌లో నయన తార కనిపిస్తుంది. ఆక్సిజన్ సాయంతో ఊపిరి పీల్చుకుంటున్న పిల్లాడితో నయన్ కూడా ఆ బస్సులో ప్రయాణిస్తుంది. అయితే, ప్రమాదం తర్వాత బస్సులో ప్రయాణికులు ఒకరినొకరు కొట్టుకోవడం, అంతా మరో 12 గంటలు మాత్రమే ప్రాణాలతో ఉంటారని నయన్ చెప్పడం.. ఇలా ఉత్కంఠభరితంగా టీజర్ సాగుతుంది. చివరిలో ప్రయాణికులంతా నయన్ మీద దాడి చేయడాన్ని చూపించారు. ఇంతకీ వారు ప్రాణాలతో బయటపడతారా? ప్రయాణికులు నయన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారో తెలియాలంటే.. ఆ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)