Eekta Kapoor : ఏక్తా కపూర్కి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ - తొలి భారతీయురాలిగా గుర్తింపు!
Ektaa Kapoor : బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కి అరుదైన గౌరవం దక్కింది 51 వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు ఆమెను వరించింది.
Ektaa Kapoor : బాలీవుడ్ దర్శక నిర్మాత ఏక్తా కపూర్(Ektaa Kapoor) అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డ్స్(International Emmy Awards) వేడుకలో ఏక్తా కపూర్ కి అరుదైన ఘనత దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కి ఆర్ట్స్ అండ్ టీవీ ఇండస్ట్రీలో చేసిన కృషికి గాను న్యూయార్క్ లో 2023 నవంబర్ 20 న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వేడుకలో ఇంటర్నేషనల్ ఎమీ డైరెక్టరేట్(International Emmy Directorate Awar) అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలిగా ఏక్తాకపూర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఇక ఈ ఎమ్మీ అవార్డును ఫేమస్ రైటర్ దీపక్ చోప్రా చేతుల మీదుగా అందుకుంటూ..' ఈ గర్వించదగ్గ ఎమ్మీ అవార్డు ఇండియా కోసం' అంటూ ఎంతో ఎమోషనల్ అయింది. తనకు గుర్తింపు దక్కడం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.." నా హృదయంలో ఈ అవార్డుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ లో ఇది ఎంతో కీలకమైన అంశం. ఈ వేదిక పై నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంతో పాటు గౌరవంగానూ ఉంది" అంటూ తెలిపింది ఏక్తాకపూర్. టెలివిజన్ పరిశ్రమలో మార్కెట్ లీడర్ షిప్ తో పాటు భారతదేశపు అగ్రశ్రేణి ఎంటర్టైన్మెంట్ షోస్ ని నిర్మిస్తూ వస్తున్న ఏక్తా కపూర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో ఇండియా వైడ్ గా ఎంతోమంది ఆడియన్స్ ని సొంతం చేసుకుంది.
ఇక టెలివిజన్ రంగంలో ఎంతో ఫేమస్ అయిన ఈ అవార్డును ఏకంగా ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. అలాంటి ఈ గొప్ప అవార్డు ఏక్తా కపూర్ కి దక్కడం పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఏక్తా కపూర్ విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేందర్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టెలివిజన్ ప్రొడ్యూసర్ గా, మూవీ ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన తండ్రి స్థాపించిన 'బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్' కంపెనీలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ గా పని చేసిన ఏక్తా కపూర్ ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలను స్వయంగా తానే చూసుకుంటుంది.
అదే కంపెనీకి అనుబంధంగా 'బాలాజీ మోషన్ పిక్చర్స్'(Balaji Motion Pictures) అనే ప్రొడక్షన్ హౌస్ ని 2001లో లాంచ్ చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ పై కొన్ని విజయవంతమైన చిత్రాలను సైతం నిర్మించింది. 2017లో 'ఆల్ట్ బాలాజీ'(Alt Balaji) పేరుతో ఓటీపీని లాంచ్ చేసింది. ఇక 2020లో ఆర్ట్స్ ఫీల్డ్ లో చేస్తున్న కృషికి గాను పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకుంది. అలా టెలివిజన్, ఫిలిం రంగాల్లో మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్న ఏక్తా కపూర్ కి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు దక్కడం విశేషం.
Also Read ; 'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై నాగవంశీ అదిరిపోయే అప్డేట్
View this post on Instagram