By: ABP Desam | Updated at : 01 Jun 2023 07:08 PM (IST)
Photo Credit: Rana Daggubati/ Instagram
మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ కి మన తెలుగులో ఎంతో మంచి క్రేజ్ ఉంది. 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ ఆ తర్వాత 'సీతారామం' సినిమాతో భారీ సక్సెస్ అందుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ హీరో సినిమా కోసం మలయాళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. అంతేకాదు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి మన టాలీవుడ్ భల్లాలదేవుడు దగ్గుబాటి రానా నిర్మాతగా వ్యవహరించబోతుండడం విశేషం. దగ్గుపాటి రానా హీరో గానే కాకుండా నిర్మతగా కూడా ఇప్పటికే పలు సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. రానాకి స్పిరిట్ మీడియా అనే బ్యానర్ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ పైనే ఇప్పుడు దుల్హర్ సల్మాన్ తో చేయబోయే సినిమాను నిర్మించబోతున్నాడట రానా దగ్గుపాటి.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కోలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ ప్రాజెక్టుని బై లింగ్వల్ మూవీ గా అంటే తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. లేటెస్ట్ ఫిలింనగర్ టాక్ ప్రకారం జూన్ 6న రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారట. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీ ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను రామానాయుడు పుట్టినరోజున చెప్పబోతున్నారట. ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మలయాళం లో 'కింగ్ ఆఫ్ కోత' అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. అయితే ఇదే సినిమాని రానా నిర్మించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా రానా స్పిరిట్ బ్యానర్ పై 'పరేషాన్' అనే సినిమా రూపొందింది. ఇటీవల 'మసూద' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తిరువీర్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. పావని, మురళీధర్ గౌడ్ బన్నీ అభిరామ్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రను పోషిస్తున్నారు.యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉన్నాడు దగ్గుబాటి రానా. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రూపక్ రోనాల్డ్ సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 2న థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్ - ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?
Rakshit Shetty: ఆమె కలలు పెద్దవి - రష్మిక గురించి షాకింగ్ విషయం బయపెట్టిన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి
వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!
Vivek Agnihotri: ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>