Double ISMART: జెట్ స్పీడ్ లో 'డబుల్ ఇస్మార్ట్'.. లేటెస్ట్ అప్డేట్ తో వచ్చిన ఛార్మీ!
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. ముంబైలో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగిసింది.
ఉస్తాద్ రామ్ పోతినేని - డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 2019లో వచ్చిన ఈ సినిమా దర్శక హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ క్రేజీ కాంబోలో దీనికి సీక్వెల్ గా ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ దీనికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
'డబుల్ ఇస్మార్ట్' సినిమా షూటింగ్ జూలై 11న ముంబైలో ప్రారంభమైంది. దాదాపు ఇరవై రోజుల పాటు చిత్రీకరణ జరిపి, ఫస్ట్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ లో రామ్ తో పాటు సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. త్వరలోనే మరో క్రేజీ షూట్ ను ప్రారంభించడానికి టీమ్ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఛార్మీ ట్వీట్ చేస్తూ.. "మా యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు మరో క్రేజీ షూటింగ్ కోసం ఇండియా నుండి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది. 'డబుల్ ఇస్మార్ట్' 2024 మార్చి 8న థియేటర్స్ లోకి వస్తుంది" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ తో ఉన్న ఒక సెల్ఫీ ఫోటోని కూడా షేర్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ శాతం మన దేశంలోనే షూటింగ్ చేసిన పూరీ.. ఈసారి ఉస్తాద్ శంకర్ ను ఫారిన్ లొకేషన్స్ కు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: హిట్టు కొట్టాలంటే గన్ను పట్టాల్సిందే - ఈ గన్స్ లేకపోతే ఏమైపోయేవారో!
'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ కావడంతో 'డబుల్ ఇస్మార్ట్' సినిమాపై అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే పూరి జగన్నాధ్ పెద్ద స్పాన్ ఉన్న కథ రాశారని తెలుస్తోంది. అలానే ఇందులో ప్రధాన నటీనటులను పూర్తిగా స్టైలిష్ గా చూపించనున్నారు. రామ్ చాలా స్టైలిష్ గా, బెస్ట్ లుక్ లో కనిపించనున్నారు. సంజయ్ దత్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బిగ్ బుల్ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్ తో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా రూపొందుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని గియాన్నెల్లి వర్క్ చేస్తున్నారు. పాపులర్ స్టంట్ డైరెక్టర్ కేచ యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. మరికొందరు టాప్ నాచ్ టెక్నిషియన్స్, స్టార్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. ప్రస్తుతం హీరోయిన్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ వెల్లడిస్తారు.
'డబుల్ ఇస్మార్ట్' అనేది ఒక క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ & ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని 2024 మహా శివరాత్రి కానుకగా మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read: 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్‌వీర్'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial