అన్వేషించండి

18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తెకే ఆ ఇంటి పనివారు షాకిచ్చారు. ఎంతో నమ్మకంగా ఇల్లు అప్పగిస్తే.. ఏకంగా ఆ ఇంటికే కన్నం వేసి అడ్డంగా దొరికిపోయారు.

జినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇటీవల తన ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన ఇంటి పనివారిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. చివరికి ఆమె అనుమానమే నిజమైంది. ఆ ఇంట్లో పనిచేసే ఓ మహిళ, డ్రైవర్ కలిసి.. ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీరు గత 18 ఏళ్లుగా ఐశ్వర్యకు ఎలాంటి అనుమానం రాకుండా నగదు చోరీలు చేస్తూ ఏకంగా ఇల్లే కట్టేశారు. 

ఐశ్వర్య రజినీకాంత్‌ ఫిబ్రవరి నెలలో పోలీసులను ఆశ్రయించారు. చెన్నైలోని తన ఇంట్లో దాచిన సుమారు 60 సవర్ల బంగారం, వజ్రాల నగలు కనిపించడం లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆభరణాల విలువ, అనుమానితుల వివరాలు చెప్పాలని ఆమెను కోరారు. తన డైమండ్ సెట్‌లు, టెంపుల్ జ్యువెలరీ, నవరత్నాల సెట్లు, పాత బంగారం, గాజులు తదితర ఆభరణాలన్నీ తన ఇంటి లాకర్‌లోనే పెట్టానని.. చివరిసారిగా వాటిని 2019లో చూశానని పేర్కొన్నారు. తన సోదరి సౌందర్య పెళ్లి తర్వాత తిరిగి వాటిని ఆ లాకర్‌లోనే పెట్టేశానని వెల్లడించారు. అప్పటి నుంచి తాను ఆ నగలను వేసుకోలేదని తెలిపారు. తన ఇంట్లో పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకటేశన్‌లపై అనుమానం ఉందని తెలిపారు. తాను ఇంట్లో లేనప్పుడు వారు మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, తాళాలు ఎక్కడ పెడతానో వారికి తెలుసని ఐశ్వర్య పేర్కొంది. దీంతో పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. మండావలీ ప్రాంతానికి చెందిన ఈశ్వరి (46) అనే మహిళ ఐశ్వర్య ఇంట్లో సుమారు 18 ఏళ్ల నుంచి పనిచేస్తోందని, తిరువెరకడుకు చెందిన కె.వెంకటేశన్ అనే డ్రైవర్‌తో గత కొన్నాళ్లుగా ఆ ఇంట్లోని విలువవైన వస్తువులు, నగలు చోరీ చేసిందని పోలీసులు తెలిపారు. అన్నీ ఒకేసారి చోరీ చేస్తే అనుమానం కలుగుతుందనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వాటిని దొంగిలించేవారని పేర్కొన్నారు. అలా దొంగిలించిన ఆభరణాలతో ఆమె చెన్నైలో ఒక ఇల్లు కూడా నిర్మించింది. అలాగే కొన్ని విలువైన వస్తువులను సైతం కొనుగోలు చేసిందని తెలిపారు. అయితే ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు వారు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఐశ్వర్య ఇంటి నుంచి సుమారు 100 సవర్ల బంగారం, 30 గ్రాముల డైమండ్ నగలు, నాలు కిలోల వెండి సామాన్లు, కొన్ని విలువైన డాక్యుమెంట్లను దొంగిలించినట్లు పోలీసులు వివరించారు. ఇప్పటికే వాటిని నగదుగా మార్చివేసినట్లు తేలింది. 

Also Read : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?

ప్రస్తుతం ఐశ్వర్య ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రజనీ కాంత్ కూడా ఓ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 8న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లగా, ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. క్రికెట్ అలాగే రాజకీయాల నేపథ్యంలో మూవీ కథ ఉండబోతోందని సమాచారం. 

టాప్ హెడ్ లైన్స్

Yash Alibaug Property: షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Jana Nayagan: సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget