అన్వేషించండి

Pushpa 2 : "పుష్ప 2" ట్రైలర్​లో అరగుండుతో ఉన్న ఆ నటుడు ఎవరో తెలుసా?

Pushpa 2 The Rule trailer : తాజాగా రిలీజ్ అయిన 'పుష్ప 2' ట్రైలర్ లో ఓ వ్యక్తి అరగుండుతో కన్పించి, అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను ఎవరో తెలుసా ?

Pushpa 2 The Rule : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న "పుష్ప 2" ట్రైలర్ రానే వచ్చింది. గంటల వ్యవధిలోనే భారీ సంఖ్యలో వ్యూస్ తో ఈ ట్రైలర్ దూసుకెళ్లడం చూస్తుంటే.. మూవీ లవర్స్ "పుష్ప 2" మూవీనీ థియేటర్లలో వీక్షించడం కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ను చూశాక, అందులో ఉన్న హైలెట్స్ గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్లో అరగుండుతో ఉన్న వ్యక్తి ఎవరు ? అనే విషయంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. 

పాన్ ఇండియా సినిమా అన్నాక అందులో ఉండే ప్రతి పాత్రకూ ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులోనూ విలన్ గా కనిపించే వారిపై మూవీ లవర్స్ కి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలా తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "పుష్ప 2" మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ లో కూడా ఈ అరగుండు వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో "పుష్ప 2: ది రూల్" మూవీ ట్రైలర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. 2024 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, ట్రైలర్ తో ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా, అందులో అరగుండు వ్యక్తి దగ్గర అందరి దృష్టి ఆగిపోయింది.

అది చూడడానికి జాతర సీన్ లా అన్పిస్తోంది. నుదుట బొట్లు, మెడలో చెప్పుల దండతో ఉన్న ఈ వ్యక్తి ముఖంలో విలనిజం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. ఈ అరగుండు వ్యక్తి మరెవరో కాదు తారక్ పొన్నప్ప. పేరు చెప్తే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒక కన్నడ ప్రముఖ నటుడు. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో కన్నడ పరిశ్రమకు చెందిన వాడే అయినప్పటికీ తెలుగుతో పాటు పాన్ ఇండియా సినిమాల్లో బిజీ యాక్టర్. ఇప్పటికే తారక్ పొన్నప్ప "కేజిఎఫ్" సినిమాలో కీలక పాత్రను పోషించారు. అలాగే ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన "దేవర" మూవీలో కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు.

ఇక ఇప్పుడు "పుష్ప 2" మూవీలో ఏకంగా పుష్పరాజ్ తోనే ఫైట్ చేయబోతున్నారు. అలాగే త్వరలోనే జీ5లో స్ట్రీమింగ్ కాబోతున్న "వికటకవి" అనే వెబ్ సిరీస్ లో కూడా ఆయన ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. "వికటకవి" సిరీస్ నవంబర్ 28న స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలా రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా దాకా అన్ని సినిమాల్లోనూ కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప బిజీ యాక్టర్ అయిపోయారు. ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ ను పాన్ ఇండియా వాడుకుంటున్నారు మేకర్స్ కూడా. ఇక "పుష్ప 2" మూవీలో తారక్ పొన్నప్ప పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా "పుష్ప 2" మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ గా మరోసారి ఫాహద్ ఫాజిల్ సందడి  చేయబోతున్నారు. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్న కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ పార్ట్ లో కేవలం ఇండియాకి పరిమితమైన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఇప్పుడు ఖండాంతరాలు దాటి, ప్రపంచ వ్యాప్తంగా పుష్ప రాజ్ పేరును మార్మోగించబోతున్నట్టు ట్రైలర్ లోనే చెప్పేశారు. మొత్తానికి ట్రైలర్ ని చూశాక ఈసారి పుష్ప రాజ్ గట్టిగానే పార్టీ ఇవ్వబోతున్నాడు అనిపిస్తుంది.

Also Read: పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget