Alia Bhatt Ranbir Kapoor: రణ్‌బీర్‌తో ఏ వయసులో ఆలియా ప్రేమలో పడిందో తెలుసా?
Alia Bhatt and Ranbir Kapoor Love Story: హిందీ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే... రణ్‌బీర్‌తో ఏ వయసులో ఆలియా ప్రేమలో పడ్డారో తెలుసా?
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల (ఏప్రిల్) 17న వారిద్దరూ ఏడు అడుగులు వేయనున్నారని సమాచారం. పెళ్లి సందడి ఈ నెల 13 లేదా 14న ప్రారంభం కావచ్చని ముంబై ఖబర్. త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు సరే... అసలు, ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఏంటి? అనే వివరాలు తెలుసా?
అలియాకు రణ్‌బీర్ కపూర్ అంటే ఇష్టం! ఆమె ఫస్ట్ క్రష్ అతడే. ఈ సంగతి వేరే ఎవరో చెప్పింది కాదు. స్వయంగా ఆలియా భట్ ఒకసారి చెప్పారు. ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా దగ్గర రణ్‌బీర్ కపూర్ కొన్ని రోజులు సహాయ దర్శకుడిగా పని చేశారు. అప్పుడు 'బ్లాక్' సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆలియా భట్ ఆ సినిమాలో నటించాలని అనుకున్నారు. సంజయ్ ఆఫీసుకు వెళ్లి ఆడిషన్స్ ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్ ఆ సమయంలో అక్కడ ఉన్నారు. అతడిని చూసి ఆలియా మనసు పారేసుకున్నారట. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్ళు.
ఆలియా భట్ ఫస్ట్ క్రష్ రణ్‌బీర్ కపూర్ అయినప్పటికీ... అతడి ఫస్ట్ క్రష్ మాత్రం ఆమె కాదు. ఆలియా కంటే ముందు సుమారు ఎనిమిది మంది హీరోయిన్లలో అతడు ప్రేమాయణం సాగించాడు. అందులో ఒకరైన కత్రినా కైఫ్, ఆలియా భట్ క్లోజ్ ఫ్రెండ్స్. జిమ్ పార్ట్‌నర్స్ కూడా! కత్రినాతో రణ్‌బీర్ ప్రేమకథ ఆలియాకు తెలుసు. అయితే... కత్రినాతో బ్రేకప్ తర్వాత రణ్‌బీర్‌కు ఆలియా భట్ దగ్గర అయ్యారు. అదీ సంగతి!
Also Read: కారులో ఆలియా భట్ ఏం చేసిందో ఎన్టీఆర్ చెప్పబోతే...
'బ్రహ్మాస్త్ర' సెట్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ప్రేమకు పునాది పడిందని చెప్పాలి. సినిమా విడుదలయ్యే వరకూ వీరి ప్రేమ సంగతి బయట ప్రపంచానికి తెలియకుండా ఉంటే బావుంటుందని దర్శకుడు అయాన్ ముఖర్జీ కోరుకున్నారు. కానీ, కుదరలేదు. ఇద్దరూ మీడియా కంట పడ్డారు. ఆలియా భట్ కూడా ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు.
పెళ్లికి ఆహ్వానించే అతిథుల జాబితాతో పాటు పెళ్లికి ముందు ఇస్తున్న బ్యాచిలర్ పార్టీ అతిథుల జాబితాను కూడా రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ కన్ఫర్మ్ చేశారట. పెళ్లికి రెండు వారాలు కూడా లేదు. అందువల్ల, ఇరువురి కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగాయి.
Also Read: 'కె.జి.యఫ్ 2'లో అమ్మ పాట విన్నారా? ఎదగరా ఎదగరా, జగతికే జ్యోతిగా నిలవరా!