Panchatantra Kathalu: రామ్ మిరియాల పాడిన 'నేనేమో మోతెవరి' - వైరల్ అవుతుందని అంటున్న తరుణ్ భాస్కర్
Nenemo Mothevari Lyrical Released By Tharun Bhascker: 'పంచతంత్ర కథలు' సినిమాలో 'నేనేమో మోతెవరి' పాటను తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ పాట గురించి ఆయన ఏమన్నారంటే...
నోయెల్, నందిని రాయ్ (Nandini Rai), సాయి రోనక్, గీతా భాస్కర్ (Geetha Bhaskar), ప్రణీతా పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాంథాలజీ ఫిల్మ్ 'పంచతంత్ర కథలు'. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఐదు కథల సమాహారంగా రూపొందిన చిత్రమిది. ఇందులోని తొలి పాటను ఇటీవల విడుదల చేశారు.
'నేనేమో మోతెవరి... నువ్వేమో తోతాపరి!
నా గుండెల సరాసరి... కుర్సియేసి కూసొబెడతనే!
నీ అయ్యా పట్వారి... నీ చిచ్చా దార్కారి!
ఏదైతే ఏందే మరి... నిన్నుఎత్తుకొనిబోతనే!'
అంటూ సాగిన ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్, 'డీజే టిల్లు' ఫేమ్ రామ్ మిరియాల ఆలపించారు. కమ్రాన్ సంగీతం అందించారు.
'నేనేమో మోతెవరి...' పాటను విడుదల చేసిన యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ''ఇందులో మా అమ్మ గీతా భాస్కర్ గారితో ఒక రోల్ చేయించారు. సినిమా రఫ్ కట్ చూసినప్పుడు... 'నేనేమో మోతెవరి' విన్నాను. ఇది నా ఫేవరేట్ సాంగ్. తప్పకుండా వైరల్ అవుతుందని నా నమ్మకం. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించారు. రామ్ మిరియాల అందరి ఫేవరేట్. సంగీత దర్శకుడు కమ్రాన్ మంచి ట్యూన్ ఇచ్చారు. లిరికల్ వీడియోలో దర్శకుడు శేఖర్ మేకింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
Also Read : థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: డి. రవీందర్, మాటలు: అజర్ షేక్, కెమెరా: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల.
View this post on Instagram