అన్వేషించండి

Annapoorani: నయనతార 'అన్నపూర్ణి' తొలగించిన నెట్‌ఫ్లిక్స్‌ - ఇది సెన్సార్ బోర్డు అధికారాన్ని ప్రశ్నించడమే?: డైరెక్టర్

Vetrimaaran: డైరెక్టర్‌ వెట్రిమారన్‌ నెట్‌ఫ్లిక్స్‌ తీరును తప్పుబట్టారు. ఆయన మాట్లాడుతూ.. "సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ వ్యవరించింది.

Vetrimaaran Comments on Annapoorani: సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ అన్నపూర్ణి. నయన్‌ 75వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య గత డిసెంబర్‌ 1న థియేటర్లోకి వచ్చింది. కానీ ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది. పైగా కొత్త చిక్కులను తెచ్చిపెట్టుకుంది. మూవీ రిలీజైనప్పటి నుంచి సినిమాను వివాదాలు చూట్టూముడుతున్న సంగతి తెలిసిందే. ఓ సన్నివేశంలో రాముడిపై చేసిన కామెంట్స్‌ దీనికి కారణం. దీంతో పలు హిందు సంఘాలు సినిమాను బ్యాన్‌ చేయాలను డిమాండ్ చేశారు. అంతేకాదు  ‘అన్నపూర్ణి’ సినిమాను వ్యతిరేకిస్తూ శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ఢిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో మూవీ డైరెక్టర్‌, ఇతర టీం మెంబర్స్‌తో పాటు హీరోయిన్‌ నయనతారపై కేసు కూడా నమోదైంది. ఇన్నీ వివాదాల నడుమ నెట్‌ఫ్లిక్స్‌ 'అన్నపూర్ణి'ని విడుదల చేసింది. దీంతో ఈ సినిమా మరింత కాంట్రవర్సీ అయ్యింది. వెంటనే నెట్‌ఫ్లిక్స్‌ సినిమాను తొలగించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీంతో వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌ మూవీ రిలీజ్‌ చేసిన వారం రోజుల్లోపే తొలగించింది. అయినా అన్నపూర్ణిపై వివాదం సద్దుమణగలేదు. దీనిపై ఇప్పటికే మూవీ డైరెక్టర్‌ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సినిమాను స్టార్‌ హీరోలు చేస్తే ఏం చేసేవారని, అదే రజనీకాంత్‌ సినిమా అయితే ఇలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఇదే క్రమంలో మూవీ ఇండస్ట్రీ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి.

ఇది సెన్సార్ బోర్డు అధికారాన్ని ప్రశ్నించడమే..

తాజాగా డైరెక్టర్‌ వెట్రిమారన్‌ అన్నపూర్ణికి సపోర్ట్‌ చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తీరును తప్పుబట్టారు. ఆయన మాట్లాడుతూ.. "సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ వ్యవరించింది. ఈ సినిమాను తొలగించి నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఇది చిత్ర పరిశ్రమకు మంచి కాదు. ఒక చిత్రాన్నిఅనుమతించాడానికైనా, నిషేధించడానికైనా సెన్సార్‌ బోర్డుకు మాత్రమే అధికారం ఉంది. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ మూవీ తొలగించిన ఘటన సెన్సార్‌ బోర్డు అధికారాన్నే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా ఉంది" అని అన్నారు. దీంతో అతడి కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. అతడి కామెంట్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఆయన కామెంట్స్‌పై నెట్‌ఫ్లిక్స్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి!

Also Read: Akkineni Nagarjuna: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట

కాగా అన్నపూర్ణిలో శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు మాంసం భుజించాల్సి వచ్చిందంటూ చెప్పే ఓ సన్నివేశంలో మూవీ కాంట్రవర్సికి దారి తీసింది. దీనిపై ముంబైకి చెందిన శివసేన మాజీ అధ్యక్షుడు రమేష్‌ సోలంకి ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఇది లవ్‌ జిహాద్‌ను ఆదరించే చిత్రమని, యాంటీ హిందు సినిమా అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది. అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. హీరో జై పాత్ర రాముడిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల వనవాసంలో మాంసహారం వండుకుని తిన్నారంటూ చెప్పే ఈ సన్నివేశమే సినిమాను వివాదంలోకి నెట్టింది. దీంతో మూవీని బ్యాన్‌ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget