Vaitla Macho Update: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా ఫస్ట్ స్ట్రైక్ డేట్ ఫిక్స్ - అంచనాలు పెంచేస్తున్నారుగా!
Vaitla Macho Strike Update: గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'Vaitla Macho' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు.
Vaitla Macho Strike Update: ఫిర్స్ మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ #Gopichand32 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ.. ఇప్పుడు #VaitlaMacho గా మారింది. మేకర్స్ ఎప్పటికప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని తాజాగా మరో అప్డేట్ అందించారు.
#VaitlaMacho గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్ 11న ఫస్ట్ స్ట్రైక్ రాబోతోందని, ఇంతకు ముందెన్నడూ చూడని గోపీచంద్ & సరికొత్త శ్రీనువైట్ల కలిసి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వదిలిన పోస్టర్ లో గోపీ బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. ఓ పర్వత శిఖరం మీద నిలబడి, ఎదురుగా ఉన్న మంచు పర్వతాలను చూస్తున్నాడు. ఇందులో ఆయన భుజానికి గిటార్ తగిలించుకొని ఉండటాన్ని మనం గమనించవచ్చు.
Lets Begin! pic.twitter.com/i2BN0SUcMd
— Gopichand (@YoursGopichand) April 9, 2024
శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక యూనిక్ పాయింట్ తో #VaitlaMacho చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాని లావిష్ గా రూపొందిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లోనే జరుపుతున్నారని తెలుస్తోంది. ఇటలీ, మిలాన్ లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లు దర్శకుడు ఆ మధ్య వెల్లడించారు.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా వెలుగొందిన శ్రీను వైట్ల.. చివరగా 2018లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి ఫ్లాప్ మూవీ అందించారు. ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ చిత్రంతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇందులో గోపీచంద్‌ని కొత్త అవతార్ లో శ్రీను వైట్ల ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్. అతని లుక్, గెటప్ ఎలా ఉన్నాయనేది మరో రెండు రోజుల్లో రాబోయే ఫస్ట్ స్ట్రైక్ తో క్లారిటీ వచ్చేస్తుంది. అలానే ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్.
గోపీచంద్ - వైట్ల శ్రీను సినిమాకి 'విశ్వం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ఈ సినిమా నిర్మాణంలో భాగం చేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీను వైట్లతో కలిసి పలు బ్లాక్ బస్టర్స్ సినిమాలకి వర్క్ చేసిన గోపీ మోహన్ #VaitlaMacho చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 'దూకుడు' కెమెరామెన్ కెవి గుహన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ మరో రెండు రోజుల్లో వెల్లడించనున్నారు. రీసెంట్ గా 'భీమా'తో నిరాశ పరిచిన గోపీ చంద్.. శ్రీను వైట్లతో కలిసి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Also Read: ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి: ఎన్టీఆర్