Producer SKN: హీరోగా మారనున్న ‘బేబీ‘ నిర్మాత, ఆ క్యారెక్టర్ లో శాడిజం షేడ్స్ ఉంటాయన్నSKN
‘బేబీ’ నిర్మాత SKN హీరోగా మారనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత SKN ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
SKN Debut Movie As Hero: సినిమా రిపోర్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన SKN.. పీఆర్ గా, నిర్మాతగా మారారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘బేబీ’ సినిమా రీసెంట్ గా 5 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ కీలక విషయాలు వెల్లడించారు. SKN త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
SKNను హీరోగా చేసేందుకు ప్రయత్నిస్తున్నా- సాయి రాజేష్
SKNను హీరోగా చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు. “నాకు రీసెంట్ గా ఓ డైరెక్టర్ కథ చెప్పారు. ఆ కథలో సెకెండ్ లీడ్ నెరేషన్ ఇస్తుంటే, వెంటనే నేను SKN గారిని నటుడిగా తీసుకోవాలని చెప్పాను. SKN గారిని బిగ్ స్క్రీన్ మీద చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం నా వైపు ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్ కూడా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. SKN గారిని ఎలాగైనా హీరోని చేయాలంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.?” అన్నారు.
ఆ క్యారెక్టర్ లో కాస్త శాడిజం షేడ్స్ ఉంటాయి- SKN
తాను చేయాలని దర్శకుడు సాయి రాజేష్ భావించిన క్యారెక్టర్ లో శాడిజం షేడ్స్ ఉంటాయని SKN చెప్పారు. “హీరోగా చేయాలని కాదు, ఆ క్యారెక్టర్ చేయాలన్నారు. నేను చేయలేదు. ఆ క్యారెక్టర్ లో కాస్త శాడిజం షేడ్స్ ఉంటాయి. నాకు ఆ క్యారెక్టర్ బాగుంటుంది అంటున్నారు. వైష్ణవి చేస్తే, నేను ఆక్యారెక్టర్ చేస్తానని చెప్పాను. వైష్ణవి ఇప్పుడు బిజీగా ఉంది. నేనూ ఆ క్యారెక్టర్ ప్రస్తుతం ఏమీ చేయడం లేదు. అవకాశం ఉంటే చూద్దాం. నేను ఎక్కువగా చిరంజీవి, కల్యాణ్, చరణ్, బన్నీ లాంటి మెగా ఫ్యామిలీతో ప్రభాస్, రవితేజకు పీఆర్ గా పని చేశాను. వారి అభిమానులు నన్ను ఓన్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో పంచులు వేడయం వల్ల కాస్త ఫాలోయింగ్ ఉంది. వాళ్లను ఫ్యాన్స్ అనడం కంటే ఫ్రెండ్స్ అనడం మంచిది” అని చెప్పుకొచ్చారు.
5 ఫిలింఫేర్ అవార్డులు సాధించిన ‘బేబీ’
అటు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వంలో నిర్మాత SKN నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్లు సాధించింది. తాజాగా ఈ సినిమా 5 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో ఈ సినిమాకు బెస్ట్ సినిమా క్రిటిక్స్, బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్, బెస్ట్ మేల్ సింగర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులు అందుకుంది.
Also Read: పవన్ కళ్యాణ్-రవితేజతో మల్టీస్టారర్ - క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన హరీశ్ శంకర్
Read Also: 'దసరా' నటుడికి అరుదైన వ్యాధి - ADHDతో బాధపడుతున్న షైన్ టామ్ చాకో, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే!