(Source: ECI | ABP NEWS)
Vijay Deverakonda: ఫస్ట్ లుక్ చెప్పిన స్టోరీ - విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
VD14 Movie Update: యంగ్ హీరో విజయ్ దేవరకొండ 'VD14' మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా 'డ్యూడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Director Rahul Sankrityan About VD14 Movie: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. 'VD14' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా... షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీ అప్డేట్స్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' స్వాగ్ ఈవెంట్‌లో డైరెక్టర్ రాహుల్ 'VD14'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
విజయ్ నట విశ్వరూపం
'VD14' మూవీలో విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూస్తారని రాహుల్ చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మూవీలో విజయ్ సర్ పెర్ఫార్మెన్స్ చూస్తే షాక్ అవుతారని అన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగే యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు వెల్లడించారు. ఇదివరకు ఎన్నడూ చూడని డిఫరెంట్ రోల్‌లో విజయ్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ వేరే లెవల్‌లో ఉంది. తాజాగా రాహుల్ కామెంట్స్‌తో మూవీపై హైప్ పదింతలు అవుతోంది.
ముచ్చటగా మూడోసారి
ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' మూవీస్‌లో కలిసి నటించి ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయ్‌తో కలిసి రష్మిక నటిస్తున్నారు. రాయలసీమకు చెందిన ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకునిగా విజయ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లిన హీరో - నిజంగా క్యూట్‌గా లేదన్న హీరోయిన్... వీడియో వైరల్
గత కొంతకాలంగా విజయ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. లాస్ట్‌గా వచ్చిన 'కింగ్డమ్' మూవీలో విజయ్ నటనకు మంచి మార్కులే పడినా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఆయన రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'రాజావారు రాణివారు' మూవీ ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన' మూవీ కూడా చేస్తున్నారు. ముంబయిలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. SVC బ్యానర్‌లో ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.





















