అన్వేషించండి

Kantara Chapter 1 OTT: ఓటీటీలోకి 'కాంతార చాప్టర్ 1' - ఆ రోజు నుంచి స్ట్రీమింగ్?... స్పెషల్ ట్రైలర్ చూశారా?

Kantara Chapter 1 OTT Platform: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కాంతార చాప్టర్ 1' ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

Rishab Shetty's Kantara Chapter 1 OTT Release: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ పీరియాడికల్ మైథలాజికల్ డ్రామా 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అప్పటి నుంచి స్ట్రీమింగ్?

'కాంతార చాప్టర్ 1' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... ఓటీటీ ప్లే రిపోర్ట్ ప్రకారం ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కన్నడతో పాటు, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆ రోజు నుంచి మూవీ అందుబాటులోకి  వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక హిందీ వెర్షన్ మాత్రం ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.

Also Read: స్టేజీపై హీరోయిన్ బుగ్గ గిల్లిన హీరో - నిజంగా క్యూట్‌గా లేదన్న హీరోయిన్... వీడియో వైరల్

స్పెషల్ ట్రైలర్ రిలీజ్

ఇప్పటికే మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా తాజాగా మూవీ టీం స్పెషల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. మూవీలో కీలక సీన్స్‌తో ఓ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. 'ప్రకృతిని ఆరాధించే మన వాళ్లు ఆ రాయిలో దైవత్వాన్ని చూసే లోపే తేటతెల్లని నీరు రక్తంతో ఎరుపెక్కింది.' 'ఈ మట్టిలో దైవత్వం మళ్లీ మళ్లీ పుడుతుంది' అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్, శివ గణాల ఉగ్ర రూపం ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త ట్రైలర్ ట్రెండ్ అవుతోంది.

12 రోజుల్లోనే...

రిలీజ్ అయిన 12 రోజుల్లోనే రూ.675 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. వారం రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. కన్నడ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2022లో వచ్చిన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నట్లుగానే రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా... ప్రమోద్ శెట్టి, గుల్షన్ దేవయ్య, జయరాం కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

స్టోరీ ఏంటంటే?

కందబుల కాలంలో ఓ దిక్కున అటవీ ప్రాంతంలో ఉండే దైవిక భూమి 'కాంతార'. అక్కడ ఈశ్వరుని పూదోట, మహిమ గల బావికి రక్షణగా కాంతార తెగ వారు కాపలా కాస్తుంటారు. బావిలో దొరికే బిడ్డకు బెర్మె (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతారు. ఈశ్వరుని పూదోటపై కన్నేసిన బాంగ్రా రాజు దారుణంగా ప్రాణాలు కోల్పోగా... తన తండ్రి మృతిని కళ్లారా చూసిన రాజశేఖరుడు (జయరాం) కాంతార జోలికి వెళ్లడు. కానీ అతని వారసుడు కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) కాంతారను చేజిక్కించుకోవాలని చూస్తాడు.

ఆ తర్వాత ఏం జరిగింది? తమను ఊచకోత కోయాలని చూసిన కులశేఖరున్ని బెర్మె ఎలా ఎదుర్కున్నాడు? అసలు ఈశ్వరుని పూదోట వెనుక ఉన్న స్టోరీ ఏంటి? కాంతార దైవిక భూమిలో ఉన్న దైవ గణాల రహస్యం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget