Puri Musings: ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే... దానితోనే కలిసి బతకమంటూ పూరి షాకింగ్ వీడియో
Puri Musings: పూరి జగన్నాధ్ తన మ్యూజింగ్స్‌తో ఎప్పటికప్పుడు తన గ్రాఫ్‌ని పడిపోనివ్వకుండా కాపాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన షేర్ చేసిన ‘టినీ లివింగ్ థింగ్స్’ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Puri Musings: పూరి జగన్నాధ్.. ఈ పేరుకున్న పవర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతం ఆయన టైమ్ అంతగా బాగాలేదనే చెప్పుకోవాలి. ఒకప్పుడు స్టార్ హీరోలంతా పూరితో సినిమా చేయడానికి క్యూలో ఉండేవారు. ఇప్పుడు పూరితో సినిమా అంటే పారిపోయే పరిస్థితి. దీనికి కారణం పూరి స్వయంకృతాపరాధమే అని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే, ఆయన ఫేట్ ఎలా ఉన్నా, పూరిని ఫాలో అయ్యేవారి సంఖ్య మాత్రం మార్పు ఉండదు. డబుల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే టాలెంట్‌కి కేరాఫ్ అడ్రస్ ఈ దర్శకుడు. సినిమాల పరంగా కాస్త డౌన్‌లో ఉన్నా.. తిరిగి పుంజుకోవడానికి పూరికి ఎంతో టైమ్ పట్టదు. పడటం, మళ్లీ లేవడం పూరికి కొత్తేం కాదు. సినిమాల పరంగా ఇలా ఉన్నప్పటికీ.. పూరీ తన మ్యూజింగ్స్‌తో ఎప్పటికప్పుడు తన గ్రాఫ్‌ని పడిపోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉన్నారు. తాజాగా ‘టినీ లివింగ్ థింగ్స్’ అంటూ పూరి ఓ వీడియోని షేర్ చేశారు. బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటితో కలిసి జీవించాలంటూ పూరి చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read: 'ఖలేజా' రీ రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్ - మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలు కారణం ఏంటో తెలుసా?
ఇందులో పూరి మాట్లాడుతూ.. ‘‘మన కంటికి కనిపించని ఎన్నో జీవాలు మన శరీరంలో బతుకు తుంటాయి. వీటిని మైక్రోబ్స్ అంటారు. హ్యూమన్ బాడీ అనేది ఎన్నో మిలియన్‌ల జీవరాశులకు పుట్టినిల్లు. అవి మనతోనే ఉంటాయి.. మనమీదే బతుకుతాయ్. మన చర్మం, ముక్కులోనూ, నోట్లో, కళ్లల్లో, జుట్టులో, పొట్టలో ఎక్కడపడితే అక్కడ బతుకుతాయ్. అది మనకు తెలియదు., మనకు కనిపించవ్. నిజానికి అవే మన ఫ్యామిలీ మెంబర్స్. మైక్రోస్కోప్ పెట్టి చూస్తే.. మనకి మతిపోతుంది. ఏంటి మన మీద ఇన్ని ఉన్నాయా? అని. వాటన్నింటికి వాటి హౌస్ మీద చాలా గౌరవం ఉంటుంది. అందుకే, మనిషి బతకడానికి అవసరమైనవన్నీ అవి సమకూరుస్తాయి. ఇందులో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలా ఎన్నో జాతులు.. వాటి పిల్లలు, మనవలు మన మీద, మన ఒంటి మీద పడి బతుకుతూ ఉంటాయి. ఈ మొత్తం భూమ్మీద ఎంత మంది మనుషులు ఉన్నారో, అంతకంటే ఎక్కువ జీవాలు మన శరీరంలో ఉంటాయ్. ఈ మైక్రోబ్స్ మనం తినే ఫుడ్ జీర్ణమవడానికి, న్యూట్రియంట్స్‌ను అబ్జర్వ్ చేయడానికి, మనకు హానికర బ్యాక్టీరియాను చంపడానికి అవి ఉపయోగపడతాయి. విటమిన్స్‌ని, ప్రొటీన్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. మన వ్యాధి నిరోధకశక్తిని బలంగా చేసి, ఇన్‌ఫెక్షన్స్‌తో ఫైట్ చేస్తాయ్.
మీ పొట్టలో వెయ్యి రకాలు జాతులు, మీ నోట్లో 700 రకాల జాతులు ఉంటాయి. మన ఒంటి మీద ఉన్న జీవాలన్నీ లెక్క పెడితే, 100 ట్రిలియన్ మైక్రోబ్స్ ఉంటాయ్. బరువు తూస్తే దాదాపు రెండు కిలోలు ఉంటాయి. ఈ పల్లెటూళ్లలో బతికే వాళ్లు మైక్రోబ్స్‌ను ఎక్కువగా డిస్టర్బ్ చేయరు. వాటితో కలిసి హ్యాపీగా బతికేస్తారు. కానీ పట్టణాల్లో బతికేవాళ్లు మాత్రం పరిశుభ్రత పేరుతో పదే పదే చేతులు సబ్బుతో కడిగేయడం, శానిటైజర్ రాసేయడం, డిస్టిల్డ్ వాటర్ మాత్రమే తాగడం వలన ఈ మైక్రోబ్స్‌ను దూరం చేసుకుంటున్నారు. దాని వల్లే వారి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
<>
నేచర్‌తో కలిసి మనం బతకాలి. కుక్కలు, కోళ్లు, ఆవులు, గొర్రెలు, గుర్రాలతో కలిసి బతకడం నేర్చుకోండి. అలా చేస్తే ఈ మైక్రోబ్స్ స్ట్రాంగ్ అవుతాయ్. మనం కూడా స్ట్రాంగ్‌గా ఉంటాం. అందుకే ఎక్కడ నీళ్లు అక్కడ తాగండి. అక్కడున్న గాలి పీల్చండి.. అక్కడున్న తిండే తినండి. అతి పరిశుభ్రత మంచిది కాదు. అందుకే మీ అమ్మమ్మ ఉన్నంత బలంగా మీ అమ్మ ఉండదు. మీ అమ్మ ఉన్నంత బలంగా మీరు ఉండరు. మీలా మీ పిల్లలు ఉండరు. ప్రతి జనరేషన్ బలహీనంగా తయారవుతూనే ఉన్నారు తప్ప బలపడటం లేదు. స్ట్రాంగ్‌గా ఉండాలంటే పల్లెటూరి వాళ్లలా బతకండి. ఈ టిష్యూలు, శానిటైజర్‌లు వాడే బ్యాచ్ ఎక్కువ కాలం ఉండరు. అందుకనే మీ పిల్లల్ని మట్టిలో ఆడుకోనీయండి. వర్షంలో తడవనీయండి. వీలైతే ఇంట్లో ఓ కుక్కనో, పిల్లినో పెంచుకోండి. నేచర్‌కి దూరంగా బతకొద్దు.. చస్తారు’’ అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ మ్యూజింగ్స్ విన్నవారంతా.. మనమంతా కరోనా వంటి మహమ్మారితో కలిసి బతకాలని, శానిటైజర్లు వంటి దూరం పెట్టాలని పూరి చెబుతున్నట్లుగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరికొందరేమో.. ప్రాణాలు తీసే కరోనాతో కూడా కలిసి బతకమంటున్న పూరి చాలా గ్రేట్ అంటున్నారు. మొత్తంగా అయితే ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ 'తుడరుమ్' - తెలుగులోనూ చూసేయండి





















