అన్వేషించండి

కార్తీతో కామెడీ ప్రయోగం? మరో ద్విభాషా చిత్రానికి సిద్ధమవుతోన్నదర్శకుడు అనుదీప్

'జాతి రత్నాలు'తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనుదీప్.. ఇప్పుడు మరో తెలుగు సినిమాతో రానున్నారు. తమిళ హీరో కార్తి కథానాయకుడిగా ఈ సినిమా రూపొందించనున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

Anudeep: 'జాతిరత్నాలు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అనుదీప్. ఆయన తెలుగుతో పాటు తమిళంలోనూ శివ కార్తికేయన్‌తో కలిసి 'ప్రిన్స్' అనే చిత్రాన్ని కూడా రూపొందించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కామెడీ బాగున్నా.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం విఫలమై.. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

తాజా సమాచారం ప్రకారం అనుదీప్ మరోసారి ద్విభాషా చిత్రాన్ని రూపొందించే యోచనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా ఆయన తమిళ హీరో అయిన కార్తీతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగులో ఇప్పటికే కార్తీ పలు సినిమాలు చేసి.. తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాడు. పలు సినిమాల్లోనూ అతని కామెడీ టైమింగ్ కు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక అనుదీప్ కూడా తన టాలెంట్ ఏంటో ‘జాతి రత్నాలు’తో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే.. తప్పకుండా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

అనుదీప్ 'పిట్టగోడ' అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేకపోయింది. దీంతో మొదటి సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ అనుదీప్‌ని ప్రోత్సహించి, వెంటనే అతడికి దర్శకుడిగా మరో అవకాశం ఇవ్వాలనుకున్నాడు. అలా వచ్చిందే 'జాతి రత్నాలు'. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కామెడీ. ఇదే సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. మూవీలో తెలంగాణ యాస కూడా అందర్నీ తెగ ఆకట్టుకుంది. దీంతో జాతి రత్నాలు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్లే రాబట్టింది.

అయితే అనుదీప్ అప్పట్లో వెంకటేష్ కి ఓ కథ చెప్పారని.. ఆయనతో త్వరలోనే సినిమా తీయనున్నారనే వార్తలు హల్ చల్ చేశాయి, కానీ ఆ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం వెంకటేష్.. శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత అనుదీప్ తో చేస్తారంటూ టాక్ నడుస్తోంది. అయితే అనుదీప్.. కార్తీతో సినిమా అన్న దానిపైనా ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఒకవేళ పైన చెప్పిందే నిజమైతే.. ఆయన మొదటగా ఎవరితో సినిమా చేస్తాడోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంతే కాదు ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని సమాచారం. దీంతో ఈ బ్యానర్ లోనూ ఓ మూవీ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ నిజమా కాదా తెలియాలంటే.. అనుదీప్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే దాకా ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Read Also : Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్ - మూవీ రిలీజ్ డేట్ మారిపోయిందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Viral News: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Embed widget