అన్వేషించండి

Euphoria OTT : థియేటర్లలోనే ఎంజాయ్ చేయండి - 'యుఫోరియా' ఓటీటీ రిలీజ్‌పై గుణశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్

Euphoria Review : యుఫోరియా మూవీ ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదని... థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలని డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. తాజా ప్రెస్ మీట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Director Gunasekhar About Euphoria Movie OTT Deal : చాలా రోజుల గ్యాప్ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రెస్ మీట్‌లో గుణశేఖర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

'యుఫోరియా' ఓటీటీపై...

'యుఫోరియా' మూవీ ఇప్పట్లో ఓటీటీలో రాదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు గుణశేఖర్. 'ఈ మూవీ కేవలం థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరినీ గౌరవించి తీసిన సినిమా. సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదు. కేవలం థియేటర్లలోనే ఎంజాయ్ చేయండి. తప్పకుండా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్టోరీలో పిల్లలు, పేరెంట్స్ కలిసి చూడకూడని కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉన్నాయి. అయితే, పిల్లలు చూడాలి, పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా.

వారు విడివిడిగా చూస్తే ప్రాబ్లమ్ లేదు. అందుకే A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది పేరెంట్స్, పిల్లలు కలిసి చూడలేకపోయినా ఎవరికి వారే చూడాల్సిన సినిమా. కొందరు డైరెక్టర్స్, సెలబ్రిటీలు సినిమా చూసి భయం వేస్తుందని అంటున్నారు. మన ఇంట్లో ఇలా జరుగుతుందా అని అడిగారు?. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్‌నే మూవీలో రిఫ్లెక్ట్ చేసినట్లుగా ఉందన్నారు.' అని చెప్పారు.

Also Read : యాటిట్యూడ్ స్టార్‌ చంద్రహాస్‌పై కేసు - బూతు పాట కాంట్రవర్సీపై వార్నింగ్... జర్నలిస్ట్ కంప్లైంట్‍‌తో...

'ఒళ్లు దగ్గర పెట్టుకుని తీశా'

ఈ సినిమాకు సారా అర్జున్ ఆత్మ అని ప్రశంసించారు గుణశేఖర్. 'ఆ క్యారెక్టర్‌కు సార్ అర్జున్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. మూవీ చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఆమె అద్భుతంగా నటించారు. ఈ కథకు భూమిక వెన్నెముక. 1992లో నా సినిమా జర్నీ మొదలైంది. యుఫోరియా నా 14వ సినిమా. కానీ నా ఫస్ట్ మూవీకి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాకు కూడా అంతే కష్టపడ్డాను. ఓ కొత్త కథను కొత్తగా చెప్పాలని శాయశక్తులా ప్రయత్నించాను. ఎమోషనల్ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నా.

నేను ఎప్పుడూ ప్రేక్షకులనే నమ్ముతా. వాళ్ల డబ్బుకి, టైంకు, విజ్ఞతకు వాల్యూ ఇస్తాను. ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ యుఫోరియా మూవీ తీశాను. కచ్చితంగా వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అవుతుంది' అని చెప్పారు. 

'శాకుంతలం' తర్వాత...

గుణశేఖర్ లాస్ట్‌గా శాకుంతలం సినిమా తీశారు. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యుఫోరియాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మూవీలో భూమిక, సారా అర్జున్‌లతో పాటు నాజర్, రోహిత్, గౌతమ్ మీనన్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్, సాయి శ్రీనిక రెడ్డి, కల్పలత, విఘ్నేష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. కాలభైరవ మ్యూజిక్ అందించారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Embed widget