అన్వేషించండి

Prem Kumar: ‘ప్రేమ్ కుమార్’ కథ అదే, విశ్వక్ సేన్ సినిమాతో పోలిక లేదు: దర్శకుడు అభిషేక్ మహర్షి

పలు చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అభిషేక్ మహర్షి.. ‘ప్రేమ్ కుమార్’ మూవీతో దర్శకుడిగా మారాడు.

గస్ట్ 18న ఎన్నో సినిమాలు థియేటర్లలో పోటీపడుతున్నాయి. కొత్త చిత్రాలతో పాటు రీ రిలీజ్ సినిమాలతో థియేటర్లు కలకలలాడనున్నాయి. అలా ఈ శుక్రవారం విడుదల అవుతున్న చిత్రాల్లో ‘ప్రేమ్ కుమార్’ కూడా ఒకటి. యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయిన సంతోష్ శోభన్.. మరోసారి ‘ప్రేమ్ కుమార్’తో అందరినీ ఆకట్టుకోవడానికి వచ్చేస్తున్నాడు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మించారు. పలు చిత్రాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అభిషేక్ మహర్షి.. ఈ మూవీతో దర్శకుడిగా మారాడు. సినిమా విడుదలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉండడంతో అభిషేక్ మహర్షి ‘ప్రేమ్ కుమార్’ విశేషాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నారు కానీ..

అభిషేక్ మహర్షి, సంతోష్ శోభన్.. ఈ ఇద్దరు మంచి స్నేహితులు. సంతోష్ హీరోగా నటించిన దాదాపు ప్రతీ సినిమాలో అభిషేక్ ఉన్నాడు. అయితే కేవలం కమెడియన్‌గా మాత్రమే అభిషేక్ గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ అతడు ఇంతకు ముందు ఎన్నో సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడు. ‘పేపర్ బాయ్’ అనే సినిమాలో సంతోష్, అభిషేక్ కలిసి నటించారు. అదే సమయంలో వారు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నారని, కానీ అది చివరికి సినిమా అయ్యిందని అభిషేక్ బయటపెట్టాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అభిషేక్‌కు ఎలాంటి అనుభవం లేకపోయినా.. రైటర్‌గా రానిస్తున్నాడు. హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్.. ఇలా ప్రతీ ఒక్క దర్శకుడు తనపై ఎంతోకొంత ప్రభావం చూపించాడని అభిషేక్ తెలిపాడు.

‘ప్రేమ్ కుమార్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒక్కటేనా..?

ఇప్పటికే ‘ప్రేమ్ కుమార్’ నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్‌ను విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో పోలుస్తున్నారు ప్రేక్షకులు. దానిపై అభిషేక్ స్పందించాడు. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ టీజర్ చూసినప్పుడు తాను కూడా భయపడ్డానని, కానీ ఆ చిత్ర దర్శకుడితో మాట్లాడిన తర్వా త ‘ప్రేమ్ కుమార్’ చాలా భిన్నమైన కథ అని క్లారిటీ వచ్చిందని అన్నాడు. సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్‌ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అతడి జీవితం గురించి చెప్పేదే ‘ప్రేమ్ కుమార్’ కథ అని బయటపెట్టాడు అభిషేక్.

ఆ సినిమాలే ఇన్‌స్పిరేషన్..

సంతోష్ శోభన్ ఒకసారి స్క్రిప్ట్ ఒప్పుకున్న తర్వాత దర్శకుడు ఏం చెప్తే అదే చేస్తాడని తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించాడు అభిషేక్ మహర్షి. శ్రీచరణ్ పాకాల లాంటి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌ దగ్గర అసిస్టెంట్ లాగా పనిచేసిన అనంత్ శ్రీకర్‌ను ‘ప్రేమ్ కుమార్’కు సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమాలు తన ‘ప్రేమ్ కుమార్’ కథకు ఇన్‌స్పిరేషన్ అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఇక ‘ప్రేమ్ కుమార్’ కుటుంబ కథా చిత్రమని, అందులో తనతో పాటు తన భార్య శ్రీవిద్య కూడా గెస్ట్ రోల్స్ చేశామని తెలిపాడు. ‘ప్రేమ్ కుమార్’ లాంటి కామెడీ కథ తర్వాత ఒక సీరియస్ సినిమా చేస్తానని, కథ కూడా సెప్టెంబర్ వరకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని అన్నాడు.

Also Read: దళితులపై హీరో ఉపేంద్ర అనుచిత వ్యాఖ్యలు - కేసు నమోదు, ఆయన స్పందన ఇదీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget