Guntur Kaaram : 'గుంటూరు కారం' రిలీజ్ - దిల్ రాజు భారీ స్కెచ్?
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నైజాం లో మహేష్ బాబు 'గుంటూరు కారం' రిలీజ్ ని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Dil Raju’s Mass Strategy In Guntur Kaaram Release : ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ జరగబోతోంది. ప్రతి ఏడాది రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో అందరి కళ్ళు మహేష్ బాబు 'గుంటూరు కారం' పైనే ఉన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండడం, చాలా ఏళ్ల తర్వాత మహేష్ ఇందులో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతుండడంతో ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇదిలా ఉంటే ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే, నైజాంలో ‘గుంటూరు కారం’ సినిమా విడుదలకు దిల్ రాజు భారీ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో మొత్తం 96 సింగిల్ స్క్రీన్స్ ఉంటే అందులో ఏకంగా 90 స్క్రీన్స్ గుంటూరు కారం సినిమాని ప్రదర్శించేలా సెట్ చేశారట. మిగిలిన ఆరు స్క్రీన్స్ 'హనుమాన్'తో పాటు 'మేరీ క్రిస్మస్' లాంటి ఇతర చిత్రాలకు ఇవ్వబోతున్నారు. RRR తర్వాత మళ్లీ అంత పెద్ద కౌంట్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకి వచ్చేలా దిల్ రాజు అంతా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది.
గుంటూరు కారం తర్వాత జనవరి 13, 14 తేదీల్లో వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు మొదటి రోజే కలెక్షన్స్ ని రాబట్టుకుంటే గత రికార్డులను తిరగరాసే అవకాశం ఉంటుంది. తెలంగాణ అంతట దిల్ రాజు ఇదే స్ట్రాటజీని అమలుపరుస్తున్నారట. తెల్లవారుజామున 4 గంటల షో వేసుకునేలా ఇప్పటికే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాంతోపాటు సలార్ కి టికెట్ రేపు పెంచినట్లే అదే తరహాలో గుంటూరు కారం కు పెంచుకునేలా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడంతో దీనికి దాదాపు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వం మరీ కఠినంగా ఉంది కాబట్టి కొంతవరకు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించవచ్చని అంటున్నారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే సినిమాకు ఎక్కువ రెవెన్యూ వస్తుంది దిల్ రాజు ముందుగానే ఈ స్కెచ్ వేశారు ఆడియన్స్ లో సినిమాపై ఉన్న క్యూరియాసిటీ చూస్తుంటే బెనిఫిట్ షో టికెట్ల కోసం ఓ రేంజ్ లో డిమాండ్ వచ్చేలా కనిపిస్తోంది. గుంటూరు కారం కమర్షియల్ సినిమానే అయినప్పటికీ వింటేజ్ మహేష్ ని బిగ్ స్క్రీన్స్ పై ఊర మాస్ అవతార్ లో చూసేందుకు ఫ్యాన్స్ తహతహలాడిపోతున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ని జనవరి 8న విడుదల చేయబోతున్నారు. శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
Also Read : 'మిస్ పర్ఫెక్ట్'గా మెగా కోడలు లావణ్య - పెళ్లైన తర్వాత కుమారిగా