Dil Raju: ఫ్లాప్ దర్శకుడికి మరో అవకాశం ఇస్తున్న దిల్ రాజు - యంగ్ హీరోతో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్!
Telugu Movies: లాస్ట్ సినిమా రిజల్ట్ కంటే కథకు ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్ 'దిల్' రాజు. తన బ్యానర్ లో వచ్చిన సినిమా ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వకున్నా దర్శకుడికి ఆయన మరో ఛాన్స్ ఇస్తున్నారట.
హిట్టు ఫ్లాపుల కంటే కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju). డైరెక్టర్ ఎవరైనా ఆయన ప్రొడక్షన్ హౌస్‌లో ఒక్కసారి అడుగు పెడితే మినిమమ్ రెండు ఫిలిమ్స్ అయినా చేస్తారు. ఎంతో మంది డైరెక్టర్లతో ఆయన రెండు మూడు సినిమాలు తీశారు. ఇప్పుడు మరొక దర్శకుడితో రెండోసారి సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ డీటెయిల్స్‌లోకి వెళితే...
View this post on Instagram
పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు సినిమా
Director Parasuram Petla Next Movie: రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ 'గీత గోవిందం'. అది బ్లాక్ బస్టర్. ఆ కాంబినేషన్‌లో వచ్చిన నెక్స్ట్ సినిమా 'ది ఫ్యామిలీ స్టార్'. అయితే, ఆ మూవీ ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వలేదు. బాక్సాఫీస్ దగ్గర 'గీత గోవిందం' మేజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. అయినా సరే డైరెక్టర్ మీద 'దిల్' రాజు నమ్మకం ఉంచారు. అతడితో మరో సినిమా చేయడానికి ముందు అడుగు వేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ప్లానింగ్!
'ది ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అయినప్పటికీ... పరశురామ్ పెట్ల డైరెక్షన్ స్కిల్స్ మీద 'దిల్' రాజుతో పాటు యంగ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) కూడా నమ్మకం ఉంచాడు. పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని తెలిసింది. ప్రజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలో మూవీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని దిల్ రాజు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
View this post on Instagram
Siddu Jonnalagadda Upcoming Movies: 'టిల్లు స్క్వేర్' సక్సెస్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ ఇమేజ్ బాగా పెరిగింది. ఆడియన్స్ అతడి మూవీ అంటే ఇంట్రెస్ట్ చూపించే సిట్యువేషన్ ఉంది. అందుకని, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అతడి వెంట పడుతున్నారు. ఈ టైంలో పరశురామ్ పెట్లకు ఆయన ఛాన్స్ ఇచ్చారు అంటే ఆ కథలో విషయం ఉందని అనుకోవాలి. ప్రజెంట్ 'బొమ్మరిల్లు' భాస్కర్ డైరెక్షన్లో సిద్ధూ జొన్నలగడ్డ ఒక మూవీ చేస్తున్నాడు. దాని టైటిల్ 'జాక్'. అందులో వైష్ణవి చైతన్య హీరోయిన్. అది కాకుండా స్టైలిస్ట్ నీరజ కోన డైరెక్షన్లో మరొక సినిమా చేస్తున్నారు. దాని టైటిల్ 'తెలుసు కదా'. అందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. ఈ విజయ దశమికి 'కోహినూర్' మూవీ అనౌన్స్ చేశాడు. అది హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే మైథలాజికల్ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ.
Also Read: ఎవరీ రియా? అసలు, ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?