Dil Raju Dreams: యంగ్ టాలెంట్‌కు దిల్ రాజు గుడ్ న్యూస్ - వారి కోసం 'దిల్ రాజు డ్రీమ్స్'
Dil Raju: న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సరికొత్త ప్లాట్ ఫాంను అందుబాటులోకి తెచ్చారు. ప్రతిభ ఉన్న వారు ఇందులో రిజిస్టర్ అయితే టీం వారిని సంప్రదిస్తుంది.

Dil Raju's New Platform To Encourage New Talent In Industry: దిల్ రాజు.. ఈ పేరు గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు తీసి టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. డిస్ట్రిబ్యూటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఫస్ట్ మూవీ 'దిల్' హిట్‌తో దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నారు.
న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో దిల్ రాజు (Dil Raju) ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటివరకూ ఎంతోమంది హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లను ఆయన ఇండస్ట్రీకి అందించారు. టాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తిస్తూ వారికి మంచి అవకాశాలు కల్పిస్తుంటారు. తాజాగా.. ఆయన మరో అడుగు ముందుకేసి టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత టాలెంట్ పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొత్త ప్లాట్ ఫాం.. 'దిల్ రాజు డ్రీమ్స్'
ఇందుకోసం కొత్తగా 'దిల్ రాజు డ్రీమ్స్' (Dil Raju Dreams) పేరిట ఓ ప్లాట్ ఫాం ప్రారంభించారు దిల్ రాజు. యంగ్ టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఇందులో భాగం కావాలనుకునే వారు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే వెబ్ సైట్‌లోకి వెళ్లి తమ వివరాలు నమోదు చేస్తే.. టీం వారిని నేరుగా సంప్రదిస్తుంది.
టాలెంట్ ఉండి ఏదైనా కారణంతో తమ ప్రతిభను చూపించుకోలేకపోయిన వారికి ఇది బెస్ట్ ప్లాట్ ఫాం అని టీం చెబుతోంది. తమలో ప్రతిభ ఉన్నా ఎక్కడ చూపించుకోవాలో తెలియక చాలా మంది బయటకు రావడం లేదు. సినీ పరిశ్రమలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో.. ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియక కొంతమంది వెనుకడుగు వేస్తున్నారని.. అలాంటి వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని ద్వారా యంగ్ టాలెంట్ తమ ఆలోచనలను 'దిల్ రాజు డ్రీమ్స్' టీంతో పంచుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం? టాలెంట్ ఉండి, సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్న వారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే వారు, సినీ ఇండస్ట్రీలో భాగం కావాలనుకునే వారు లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ డ్రీమ్ నిజం చేసుకోండి.
Also Read: త్రివిక్రమ్‌ను వదిలిపెట్టేది లేదు - పొలిటికల్ సపోర్ట్‌తో తప్పించుకుంటున్నారంటూ పూనమ్ ఫైర్
రీసెంట్‌గా 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు దిల్ రాజు. ప్రస్తుతం వీరి బ్యానర్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంతో పాటు సినీ నిర్మాణంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలోనూ ఆయన ముందున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో 'లార్వెన్ ఏఐ' పేరుతో సరికొత్త టెక్నాలజీ స్టూడియోను ప్రారంభించారు. కొత్త వారితో 'తెల్ల కాగితం' అనే ప్రాజెక్టును చేయనున్నట్లు అప్పట్లో చెప్పారు. ఏఐ ద్వారా మూవీ సక్సెస్ రేటు ఎంతో పెరుగుతుందని.. దర్శక, రచయితలకు టైం సేవ్ అవుతుందనే దాంతో పాటే ప్రొడ్యూసర్స్‌కు మనీ సేవ్ అవుతుందని అన్నారు. 360 డిగ్రీస్‌లో మూవీని ఏఐ ద్వారా ఎలా చెయ్యొచ్చనేది క్రియేటివ్‌గా డెవలప్ చేసినట్లు చెప్పారు.





















