News
News
వీడియోలు ఆటలు
X

తెలుగు ప్రేక్షకుల ‘దిల్’ దోచుకున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? 

'దిల్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది అందాల భామ నేహా బాంబ్. చివరగా 'దుబాయ్ శీను' తర్వాత సినిమాలకు దూరమైన నేహా.. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో హ్యాపీగా గడుపుతోంది.

FOLLOW US: 
Share:
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలబ్రిటీలు అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. సినిమా సంగతులే కాదు.. వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అందరూ తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటీనటులు, గతంలో హీరోయిన్లుగా రాణించిన ముద్దుగుమ్మల సోషల్ మీడియా అకౌంట్స్ ను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో వారి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్ నేహా బాంబ్ ఫోటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
 
నేహా బాంబ్ అంటే గుర్తుకు రావడం కష్టమే కానీ.. 'దిల్' సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం అందరూ టక్కున పట్టేస్తారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో 2003లో తెరకెక్కిన చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన తొలి సినిమా ఇది. అందుకే ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. 
 
'దిల్' సినిమాతోనే అందాల భామ నేహా బాంబ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. అప్పటికే ఇస్క్ హోగయా మైన్' అనే హిందీ చిత్రంలో నటించిన నేహా. తెలుగులో ఎంట్రీతోనే అదరగొట్టింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ‘దిల్’ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. నితిన్ తో పాటుగా నేహాకు కూడా మంచి గుర్తింపు దక్కింది. దీంతో అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ.. సరైన సక్సెస్ లేకపోవడంతో ఆశించిన విధంగా ఆమె కెరీర్ సాగలేదు.
 
దిల్ తర్వాత తర్వాత నేహా 'అతడే ఒక సైన్యం' సినిమాలో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు హీరోగా చేసిన ఈ మూవీ అప్పుడు థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు కానీ.. ఇప్పుడు టీవీలలో మంచి ఆదరణ తెచ్చుకుంది. ఇక దోస్త్ అనే చిత్రంలో శివ బాలాజీ పక్కన నటించిన నేహా.. 'బొమ్మరిల్లు' సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. తండ్రి చాటు అమ్మాయి సుబ్బలక్ష్మిగా ఆకట్టుకున్నా, అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత 'దుబాయ్ శీను' సినిమాలో జేడీ చక్రవర్తికి జోడీగా చేసింది కానీ.. ఇది కూడా ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. 
 
ఈ నేపథ్యంలో అప్పటికే పలు హిందీ సీరియల్స్ లో నటించిన నేహా బాంబ్.. మళ్లీ టీవీ షోల బాట పట్టింది. 'నాగిన్' వంటి పాపులర్ సీరియల్ లో చేసింది కానీ.. ఎందుకనో అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. బుల్లితెరపై కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 2007లో థాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. 2009 తర్వాత మళ్లీ నటన వైపు తిరిగి చూడలేదు.
 
ప్రస్తుతం నేహా బాంబ్ తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తోంది. సినిమాలలో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇటీవలే 'దిల్' సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేహా రీసెంట్ ఫోటోలు నెట్టింట సందడి చేశాయి.
 
View this post on Instagram
 
A post shared by Neha Goragandhi (@nehabambgandhi)

అయితే ఈ ఫోటోలలో నేహా గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇద్దరు పిల్లలు తల్లి కావడంతో, ఆమె ఫేస్ లో చాలా మార్పు వచ్చింది. అయినప్పటికీ పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ఫొటోలు చూసిన నెటిజన్లు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని సూచిస్తున్నారు. మరి నేహా బాంబ్ ఆ దిశగా ఆలోచన చేస్తుందేమో చూడాలి.
 
View this post on Instagram
 
A post shared by Neha Goragandhi (@nehabambgandhi)

Published at : 28 Apr 2023 07:00 AM (IST) Tags: V V Vinayak Dil Raju Nithin Dil Neha Bamb Dil Heroine

సంబంధిత కథనాలు

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ

‘అఖండ’ నిర్మాతతో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త మూవీ

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Bharateeeyans Movie : చైనా పేరు తొలగించమని సెన్సార్ ఆర్డర్ - ఎంత దూరమైనా వెళ్తానంటున్న 'భారతీయాన్స్' నిర్మాత!

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?