Samantha Ruth Prabhu: చైతన్య గుర్తులు చెరిపేసిన సమంత... అఖిల్ పెళ్లి రోజు షాక్ ఇచ్చిన అక్కినేని మాజీ కోడలు!
Samantha Tattoo: సమంత లేటెస్ట్ బ్రాండ్ ప్రమోషన్ వీడియో వైరల్ అవుతోంది. ఆమె తన మెడపై 'వైఎంసీ' టాటూ తొలగించేశారని.. చైతన్య చివరి గుర్తులు చెరిపేశారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Samantha Removes YMC Tattoo: 'శుభం' సక్సెస్ జోష్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా.. అబుదాబీలో చిల్ అవుతూ ఆ విశేషాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. నటి, నిర్మాతగానే కాకుండా పలు బ్రాండ్లను ప్రమోట్ కూడా చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
చై గుర్తులు చెరిపేశారా?
'సీక్రెట్ ఆల్కమిస్ట్' సంస్థ ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం ఆమె ఓ స్పెషల్ వీడియో షేర్ చేశారు. నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపిస్తూ 'నథింగ్ టు హైడ్' అని పేర్కొంటూ.. 'ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైంది' అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో వైరల్ కాగా.. నెటిజన్లు ఆమె మెడపై టాటూ కనిపించకపోవడాన్ని గమనించారు. 'ఏంటీ సమంత.. 'వైఎంసీ (ఏ మాయ చేశావే)' టాటూ తొలగించేశారా?' అంటూ చర్చ మొదలుపెట్టారు.
View this post on Instagram
అఖిల్ పెళ్లి టైంలోనే ఇలా..
అయితే, అఖిల్ పెళ్లి టైంలోనే ఇలా చేశారంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. కాదు.. ఆ టాటూ చెరిగిపోయి ఉండకపోవచ్చని, మేకప్‌తో అది కనపడకుండా కవర్ చేసి ఉండొచ్చని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. చైతన్యతో విడాకుల తీసుకున్న దాదాపు నాలుగేళ్ల తర్వాత చై గుర్తులు ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
టాటూ వెనుక స్టోరీ ఏంటంటే?
సమంత హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ 'ఏమాయ చేశావే'. ఈ మూవీ నాగచైతన్య హీరోగా నటించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫస్ట్ మూవీనే రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో దానికి గుర్తుగా సమంత 'వైఎంసీ' అనే టాటూ వేయించుకున్నారు. ఇది తనకెంతో స్పెషల్ అని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు.
నాగచైతన్యతో లవ్ టైంలోనూ ఆమె అతని పేరును కూడా టాటూ వేయించుకున్నారు. 2021లో వీరిద్దరి డివోర్స్ తర్వాత టాటూలను తొలగిస్తూ వస్తున్నారు సమంత. తాజాగా 'వైఎంసీ' టాటూ కూడా తొలగించారంటూ చెబుతున్నారు నెటిజన్లు. ఇక 'సీక్రెట్ ఆలమిస్ట్' బ్రాండ్ విషయానికొస్తే ఇది బ్యూటీ, కాస్మొటిక్, పర్సనల్ కేర్ సంస్థ. ఈ సంస్థకు సామ్ సహ వ్యవస్థాపకురాలు కాగా.. తన బ్రాండ్ ప్రమోట్ చేస్తూ తరచూ వీడియోస్ చేస్తుంటారు.
Also Read: అఖిల్ పెళ్లి చేసిన కొన్ని గంటల్లో డబ్బింగ్ థియేటర్‌కు... 'కుబేర' వర్క్ ఫినిష్ చేసిన నాగార్జున
ఇక సినిమాల విషయానికొస్తే.. 2023లో విజయ్ దేవరకొండ హీరోగా 'ఖుషి' సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు. తాను నిర్మించిన 'శుభం' సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు. రాజ్, డీకే దీన్ని తెరకెక్కిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై ఇప్పుడు 'మా ఇంటి బంగారం' మూవీలో నటించనున్నారు.





















