'రూల్స్ రంజన్' నుండి మరో సాంగ్ - ఆకట్టుకుంటున్న 'దేఖో ముంబై' ప్రోమో!
కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' చిత్రం నుంచి ఫోర్త్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. 'దేఖో ముంబై' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోని సెప్టెంబర్ 19 ఉదయం10:20 గంటలకు విడుదల చేయనున్నారు.
'రాజావారు రాణి గారు', 'SR కళ్యాణమండపం', 'సమ్మతమే', 'వినరో భాగ్యం విష్ణు కథ' వంటి సినిమాలతో టాలీవుడ్లో యంగ్ హీరో గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఒకప్పుడు అల్లరి నరేష్ సంవత్సరంలో మూడు సినిమాలు ఎలా చేసేవాడో ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా అదే ఫాలో అవుతున్నాడు. రీసెంట్ గా ఈ హీరో గీతా ఆర్ట్స్ సంస్థ లో చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా, త్వరలోనే 'రూల్స్ రంజన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
రుధిరం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా' పాటలు మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'సమ్మోహనుడా' సాంగ్ అయితే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ ను విడుదల చేయనున్నారు. 'దేకో ముంబై' అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్ స్వరపరిచిన ఈ పాటని ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ, పాయల్ దేవ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్, మేఘరాజ్ రవీంద్ర సాహిత్యం అందించారు.
ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 19న ఉదయం 10:20గంటలకు నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో తన పాటలతో శ్రోతలను ఆకట్టుకున్న సింగర్ అద్నాన్ సమి మళ్లీ తెలుగులో కాలం తర్వాత 'రూల్స్ రంజన్' లో పాట పాడారు. అప్పట్లో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తన సినిమాల్లో అద్నాన్ సమితో రెగ్యులర్ గా పాటలు పాడించారు. దేవిశ్రీప్రసాద్ అద్నాన్ సమీతో పాడించిన వర్షంలో నచ్చావే నైజాం పోరి, శంకర్ దాదా జిందాబాద్ లో భూగోళమంతా, ఊసరవెల్లిలో నేనంటే నాకు, జులాయి లో ఓ మధు.. వంటి పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించాయి. మళ్లీ ఇంత కాలానికి తెలుగులో అద్నాన్ సమీ తన గొంతు వినిపించడం విశేషం.
ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దివ్యాంగ్ లావణ్య, మురళీకృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ టచ్ తో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. గోపరాజు రమణ, సిద్ధార్థ్ సేన్, మకరంద్ దేశ్ పాండే, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, నెల్లూరు సుదర్శన్ వంటి ప్రధాన తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, మళ్ళీ రిలీజ్ డేట్ మార్చేసి అక్టోబర్ 6న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
Also Read : ‘హాయ్ నాన్న‘లో ఫస్ట్ సాంగ్ రిలీజ్, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అబ్దుల్ వహాబ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial