అన్వేషించండి

Dhamaka At 100 Cr: రవితేజ కెరీర్‌లో అరుదైన రికార్డ్ - రూ.100 కోట్ల క్లబ్‌లో ‘ధమాకా’

రవితేజ హీరోగా తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రెక్ ఈవెన్ టార్గెట్ ను సాధించగా.. తాజాగా 100 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకొని రికార్డు సృష్టించింది.

మాస్ మహారాజ్ రవితేజ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమా ‘ధమాకా’. ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా ‘పెళ్లి సందD’ ఫేమ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర చేస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. తర్వాత రెండో రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్, రవితేజ వింటేజ్ యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో పాటలకు మంచి స్పందన వస్తోంది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డును సృష్టించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధమాకా’ 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి.. చరిత్ర సృష్టించింది. రవితేజ కెరీర్‌లోనే వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో మాస్ మహరాజ్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. 

‘ధమాకా’ సినిమా విడుదలకు ముందు నుంచీ మంచి హైప్ తీసుకొచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో వింటేజ్ రవితేజను చాలా రోజుల తర్వాత చూశామంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను క్రాస్ చేయడం విశేషం. ఇక అప్పటి నుంచి నిర్మాతలు లాభాలు లెక్కపెట్టుకుంటూనే వస్తున్నారు. సినిమా విడుదల అయిన రెండు వారాల్లోనే రూ.100 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.20 కోట్ల మేర జరుపుకుంది. ఇక ఏ విధంగా చూసినా సినిమా నిర్మాతలకు 30 నుంచి 40 కోట్లు లాభాలు వచ్చినట్టేనని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Also Read: స్టేజ్ మీదనే ఎమోషనల్ అయిపోయిన ప్రభాస్ - కన్నీళ్లు ఆపుకోలేక!

అంతే కాదు మరో వారం రోజుల పాటు తెలుగులో సినిమా రిలీజ్ లు ఏమీ లేవు. కాబట్టి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ‘ధమాకా’ తో రవితేజ మరో మ్యాజిక్ చేసినట్టే అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ పదో రోజు తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్ లోకి ఎక్కింది. తాజాగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. మరి మున్ముందు ఇంకెన్ని కోట్ల వసూళ్లు రాబడుతుందో చూడాలి. గతంలో రవితేజ నటించిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. అయితే మళ్లీ ‘ధమాకా’ హిట్ తో ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. ఈ మూవీ తర్వాత ఆయన మెగా స్టార్ చిరంజీవి తో కలసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget