అన్వేషించండి

Devil Movie Controversy : వినాశకాలే విపరీత బుద్ధి - 'డెవిల్' నిర్మాతకు దర్శకుడి కాంటర్!

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా సినిమా 'డెవిల్' దర్శకుడు ఎవరు? అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు నవీన్ మేడారం చేసిన ఓ పోస్ట్ కూడా చర్చకు కారణం అవుతోంది. 

'డెవిల్' (Devil Movie 2023) సినిమాకు దర్శకత్వం వహించినది తానేనని అభిషేక్ పిక్చర్స్ అధినేత, యువ నిర్మాత అభిషేక్ నామా (Abhishek Nama) వెల్లడించారు. అంటే... ఆయన బయటకు వచ్చి నోరు విప్పింది లేదు. కానీ, సినిమా పోస్టర్స్ మీద దర్శకుడిగా, నిర్మాతగా తన పేరు వేసుకోవడం ద్వారా తన అభిప్రాయం ఏమిటి? అనేది బలంగా చెప్పినట్లు అయ్యింది. ఆ పోస్టర్ గురించి తెలుగు సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నవీన్ మేడారం చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 

వినాశకాలే విపరీత బుద్ధి 
'డెవిల్' సినిమా నవీన్ మేడారం (Naveen Medaram) దర్శకత్వం మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... దర్శకుడిగా ఆయన పేరు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఏ సమస్య లేదు. కొన్ని రోజులు ఆయన వేరే వినిపించింది. అయితే... ఈ మధ్య తొలి పాట విడుదల చేశారు. అందులో దర్శకుడిగా నిర్మాత అభిషేక్ నామా పేరు ఉంది. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. దర్శకుడిగా అభిషేక్ నామా ఎప్పుడు మారారు? ఆయన మెగాఫోన్ ఎప్పుడు పట్టారు? అని!

'డెవిల్' దర్శకుడి మార్పు విషయమై రెండు వెర్షన్స్ వినపడుతున్నాయి. ఒకటి... ఫస్ట్ షెడ్యూల్ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ చెప్పడంతో నవీన్ మేడారాన్ని దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించి, అభిషేక్ నామా డైరెక్షన్ చేశారని! రెండు... సినిమా అంతా నవీన్ మేడారం తీశారని, అయితే నిర్మాతతో ఆయనకు విబేధాలు రావడంతో ఈ మార్పు జరిగిందని!

ఇప్పటి వరకు నవీన్ మేడారం ఈ ఇష్యూ మీద పెదవి విప్పలేదు. అయితే... గొడవ మీద పరోక్షంగా ఓ ట్వీట్ చేశారు. 'వినాశకాలే విపరీత బుద్ధి' అంటూ! అది నిర్మాత అభిషేక్ నామాను ఉద్దేశించి అని! పోస్టర్ మీద తన పేరు లేకపోయినా అభిషేక్ పిక్చర్స్ చేసిన ట్వీట్స్ రీ ట్వీట్స్ చేస్తున్నారు నవీన్ మేడారం. కళ్యాణ్ రామ్ వచ్చి సినిమా ఎవరి డైరెక్ట్ చేశారు? అనేది చెబితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించే మార్గం కనిపించడం లేదు.

Also Read : 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?

నవంబర్ 24న 'డెవిల్' సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ కథానాయికగా నటించారు. ఇటీవల వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన పాటను విడుదల చేశారు. 'బింబిసార'లో కూడా కళ్యాణ్ రామ్, సంయుక్త జంటగా కనిపించారు. 

Also Read 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?

'డెవిల్' సినిమాకు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌంద‌ర్ రాజన్‌ .ఎస్, సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్.  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget