అన్వేషించండి

Detective Teekshanaa : ఆయుధం కంటే ఆలోచన ముఖ్యం - పవర్‌ఫుల్ రోల్‌లో ప్రియాంకా ఉపేంద్ర

హీరో ఉపేంద్ర భార్య, కథానాయిక ప్రియాంక 50వ సినిమా 'డిటెక్టివ్ తీక్షణ' ట్రైలర్ నేడు విడుదల చేశారు.

8

ప్రముఖ కన్నడ కథానాయకుడు ఉపేంద్ర (Upendra) భార్య, కథానాయిక ప్రియాంక ఉపేంద్ర (Priyanka Upendra) తెలుగు ప్రేక్షకులకు తెలుసు. జేడీ చక్రవర్తి 'సూరి', ఉపేంద్ర 'రా' సినిమాల్లో ఆమె నటించారు. ఇప్పుడు ఆమె 50 చిత్రాల మైలురాయి చేరుకున్నారు. ప్రియాంకా ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం 'డిటెక్టివ్ తీక్షణ' (Detective Teekshana Movie Telugu).  

యుద్ధంలో ఆలోచన ముఖ్యం...
తీక్షణగా ప్రియాంక పవర్ ఫుల్ రోల్!
ప్రియాంకా ఉపేంద్ర 50వ చిత్రం 'డిటెక్టివ్ తీక్షణ'. దీనికి త్రివిక్రమ్ రఘు (Trivikram Raghu) దర్శకుడు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 

క్లుప్తంగా చెప్పాలంటే... 'డిటెక్టివ్ తీక్షణ' ట్రైలర్‌లో డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువ. ట్రైలర్ ప్రారంభంలో వరుస హత్యలు చూపించారు. ముందుగా విలన్ రోల్స్ చేసిన ఆర్టిస్టులను పరిచయం చేశారు. అందులో ఒక వ్యక్తి గెటప్ విచిత్రంగా ఉంది. ప్రేక్షకుల దృష్టి అతని మీద పడటం ఖాయం. చరిత్రలో ఎన్నడూ చూడని ఓ పెద్ద కేస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర బృందం చెబుతోంది. 

'యుద్ధంలో పోరాడేటప్పుడు ఆయుధాల కంటే ఆలోచన ముఖ్యం' అని ట్రైలర్లో ఓ మాట చెప్పారు. సారీ... చూపించారు. ఆలోచనతో వ్యవహరించే పాత్రలో ప్రియాంకా ఉపేంద్ర కనిపిస్తారని ఆ విధంగా చెప్పారన్నమాట! ఇక, 'తను వచ్చే వస్తుంది. వాడి సామ్రాజ్యాన్ని కచ్చితంగా సర్వనాశనం చేస్తుంది' అని ఆర్టిస్ట్ ఒకరు డైలాగ్ చెప్పిన తర్వాత ప్రియాంకా ఉపేంద్రను చూపించారు.

Also Read 'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?  

డిటెక్టివ్ తీక్షణగా పవర్ ఫుల్ పాత్రలో ప్రియాంకా ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. స్టార్ హీరో తరహాలో ఆమెను ప్రజెంట్ చేశారు దర్శకుడు. ఆమెతో ఫైట్స్ కూడా చాలా చేయించినట్లు అర్థం అవుతోంది. కోర్టు బయట షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎవరు? డ్రగ్స్ దందా చేసేది ఎవరు? తీక్షణ టేకప్ చేసిన కేసు ఎవరిది? ఆమె మీద ఎటాక్ చేసింది ఎవరు? వంటి ఎన్నో ప్రశ్నలను ప్రేక్షకుల ఊహకు వదిలేశారు. 

Also Read 'ఎంవై 3' వెబ్ సిరీస్ రివ్యూ : రోబోగా, హీరోయిన్‌గా హన్సిక డ్యూయల్ రోల్ - హిట్టా? ఫట్టా?

ఏడు భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' విడుదల!
తెలుగు, కన్నడతో పాటు తమిళ, మలయాళ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లో 'డిటెక్టివ్ తీక్షణ' సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదొక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాతలు గుత్తముని ప్రసన్న ( పొలకల చిత్తూర్, ఆంధ్ర ప్రదేశ్), జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్) పురుషోత్తం బి (ఎస్.డి.సి) తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రానికి కూర్పు : శ్రీధర్ వైఎస్, కళా దర్శకత్వం : నవీన్ కుమార్ బీఎం, స్టంట్స్ : గౌతమ్, ఛాయాగ్రహణం : మను దాసప్ప, సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్). 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget