Deepika Padukone: తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన దీపికా - ప్రభాస్ అయితే కాదు!
Deepika Padukone: ‘కల్కి 2898 AD’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది దీపికా పదుకొనె. అయితే తెలుగులో తన ఫేవరెట్ హీరో ప్రభాస్ అని చెప్తుందనుకుంటే దీపికా.. మరొకరి పేరు చెప్పింది.
Deepika Padukone: ప్రస్తుతం టాలీవుడ్ స్థాయి వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది. అందుకే బాలీవుడ్‌లోని స్టార్లు సైతం టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. సౌత్‌లో కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా రానున్న కొన్నేళ్లలో ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు సౌత్ సినిమాల్లో మెరవనున్నారు. అందులో ముందుగా దీపికా పదుకొనె.. టాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ‘కల్కి 2898 AD’లో ఒక కీలక పాత్రతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. ఇక ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సమయంలో టాలీవుడ్‌లో తన ఫేవరెట్ హీరో ఎవరో బయటపెట్టింది దీపికా.
కల్కి ప్రమోషన్స్‌లో దీపికా..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జంటగా దిశా పటానీ నటిస్తుండగా.. దీపికా పదుకొనె మరో కీలక పాత్రలో కనిపించనుంది. తను ప్రెగ్నెంట్ అయినా కూడా ముంబాయ్‌లో జరిగిన ప్రమోషన్స్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది దీపికా. బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌తో అందరి చూపును తనవైపే తిప్పుకుంది. ‘కల్కి 2898 AD’కు ఇప్పటికే సరిపడా హైప్ క్రియేట్ అవ్వడంతో మూవీ టీమ్ అంతా కలిసి పెద్దగా ప్రమోషన్స్ ఏమీ చేయడం లేదు. ఇందులో కీలక పాత్రల్లో నటించిన ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కలిసి ఒక ఇంటర్వ్యూ చేసి విడుదల చేశారు. అందులో దీపికా.. తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో రివీల్ చేసింది.
నా ఫేవరెట్ హీరో..
తెలుగులో తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని బయటపెట్టింది దీపికా పదుకొనె. తెలుగులో తన మొదటి సినిమా ప్రభాస్‌తో కావడంతో ప్రేక్షకులంతా తను కూడా ప్రభాస్ పేరు చెప్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. తను మహేశ్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మహేశ్‌తో కూడా తను కలిసి నటించే రోజు దగ్గర్లోనే ఉందేమో అని ఇద్దరి కామన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో ఒక మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. కానీ కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్‌నే మహేశ్‌కు జోడీగా తీసుకొస్తారని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అదేదో దీపికా పదుకొనెనే మహేశ్‌కు జోడీగా ఫైనల్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తను కూడా ఫేవరెట్..
మహేశ్ బాబు మాత్రమే కాకుండా తనకు రానా అంటే కూడా ఇష్టమని తెలిపింది దీపికా పదుకొనె. రానాకు బాలీవుడ్‌లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. తను తెలుగులో హీరోగా పరిచయమయిన కొన్నిరోజులకే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అలా ఇతర తెలుగు హీరోలతో పోలిస్తే రానాకు బాలీవుడ్‌లో కాంటాక్ట్స్ ఎక్కువే. అలా తనకు, దీపికాకు మధ్య కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒకవేళ తలచుకుంటే రానా, దీపికా స్క్రీన్ షేర్ చేసుకోవడం పెద్ద విషయమేమి కాదు. మొత్తానికి దీపికా పదుకొనె బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘కల్కి 2898 AD’లో తన పర్ఫార్మెన్స్ బాగుంటే తెలుగులో తన ఫ్యాన్ బేస్ మరింత పెరుగుతుంది.
Also Read: ‘కల్కి 2898 AD’ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?