Deepika Padukone New Look: దీపికా బర్త్‌డే, అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన కల్కి టీం - మరి రిలీజ్ డేట్ ఎప్పుడు?
Deepika Padukone Birthday Poster: పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ప్రభాస్-నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఎడీ’ మూవీ ఒకటి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది.
Kalki 2898 AD: పాన్ ఇండియా మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ప్రభాస్-నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఎడీ’ మూవీ ఒకటి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా 2024లో విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె బర్త్‌డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు దీపికాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కొత్త లుక్‌ను విడుదల చేసింది. ఇందులో దీపికా ఫుల్ సీరియస్ మోడ్‌లో కనిపించింది. ప్రస్తుతం ఆమె లుక్ పోస్టర్ మంచి స్పందన వస్తోంది. దీనిపై కల్కి లవర్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కల్కి మూవీకి నుంచి వస్తున్న ఒక్కొక్కొ అప్‌డేట్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
నాగ్ అశ్విన్ లాంటి విజన్ డైరెక్టర్ బాహుబలి లాంటి ప్రభాస్ కటౌట్ తొడవడంతో మూవీ అవుట్ పుట్‌పై సినీ లవర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దానికి బయటకు వస్తున్న అప్‌డేట్స్ అంతకు మించి ఉండటంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా దీపికా లుక్‌తో కల్కిపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు కల్కి టీం ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ మూవీ అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళుతున్నాయి. మూవీ కోసం మరి కొంత కాలం నిరీక్షించాల్సి వచ్చినా.. రిలీజ్ తర్వాత ప్రపంచమంత కల్కి మేనియానే ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసి ఓ వర్గం ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందా?
అయితే దీపికాకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఆమె పోస్టర్ విడుదల చేసిన కల్కి టీం మూవీ రిలీజ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా స్పందించింది. మొదట ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కావడం, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లో లోపాలు తలెత్తడంతో మూవీ వాయిదా పడింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకటించనప్పటికీ సినిమా మాత్రం ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఉంటుందని కల్కి లవర్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌పై కల్కి టీం ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఇటూ దీపికా లుక్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని ఖుషి చేసిన మేకర్స్.. మూవీ రిలీజ్‌కు ఎక్కువ కాలం నిరీక్షించాల్సి వస్తుందేమో అంటూ రిలీజ్ ఆలస్యం అవుతుందని చెప్పకనే చెప్పింది. దీంతో కల్కి ఈ ఏడాది వస్తుందా? లేదా? ఫ్యాన్స్ అంతా డైలామాలో పడ్డారు. మరింత నిరీక్షణ అంటే అర్థమేంటి నాగ్ సార్ అంటూ పోస్టర్‌పై స్పందిస్తున్నారు. అంటే మూవీ మరింత ఆలస్యం అవుతుందా? 2024లో రిలీజ్ లేనట్టేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం కల్కి మూవీ ఇండియన్ మూవీ హిస్టరీనే మార్చేస్తుంది అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు. మొత్తానికి దీపికా బర్త్‌డే సందర్భంగా కల్కి మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసిందంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
దీపికా లుక్‌పై ప్రభాస్ రియాక్షన్
దీపికాకు సినీ ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే డార్లింగ్ ప్రభాస్ కూడా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు. హ్యాపీ బర్త్‌డే మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ అంటూ విష్ చేశాడు, అలాగే తను మరెన్నో సక్సెస్‌లు చూడాలని, భవిష్యత్తు రోజులు మరింత అద్భుతంగా ఉండాలని ఆక్షాంక్షించాడు. కాగా సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: మోహన్ బాబుకు, నాకు పడదు - అయినా నా కోసం అలా చేశారు: శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!
View this post on Instagram