అన్వేషించండి

Dasara: సినిమా హిట్ కంటే ఫ్లాప్ అవ్వాలని కోరుకునే వాళ్లే ఎక్కువ: నాని

తాను ఇప్పటి వరకూ తనకు నచ్చిన సినిమాలే చేశానని, అయితే కొంత మంది ఇది సెట్ అవ్వదు, ఇది వేస్ట్ అంటూ కామెంట్లు చేసేవారని కానీ తాను నమ్మకంతో పని చేసుకుంటూ వెళ్లిపోయేవాడినని అన్నారు నాని.

Dasara: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇప్పటికీ మూవీ మంచి వసూళ్లతో థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కరీంనగర్‌లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సినిమా విడుదల అవుతుంటే రిలీజ్ కు మందే ‘ఈ సినిమా పోతుంది చూస్కో అని’ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అలాంటి చెడుపై ఈరోజు మంచి (దసరా) గెలిచిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ కార్యక్రమంలో నాని మట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు నుంచీ కూడా దర్శకుడు శ్రీకాంత్ తన దగ్గరకు వచ్చి ‘‘మన సినిమా నుంచి ఏదొక ఈవెంట్ కరీంనగర్ లో చేద్దాం అన్నా’’ అని అడిగేవాడని అన్నారు నాని. తను అలా ఎందుకు అడుగుతున్నారో తనకు అర్థం కాలేదని, కానీ ఇక్కడకు వచ్చాక అభిమానుల ఉత్సాహం చూస్తే తెలిసిందని అన్నారు. తమ సినిమాను ఇంతలా ఆదరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

సినిమాలు ఆడకూడదు అని కోరుకునే వాళ్లే ఎక్కువ

తాను ఇప్పటి వరకూ తనకు నచ్చిన సినిమాలే చేశానని, అయితే కొంత మంది ఇది సెట్ అవ్వదు, ఇది వేస్ట్ అంటూ కామెంట్లు చేసేవారని.. కానీ తాను నమ్మకంతో పని చేసుకుంటూ వెళ్లిపోయేవాడినని అన్నారు. అభిమానుల ప్రోత్సాహం కూడా చాలా ఉందని అన్నారు. అందుకే ‘దసరా’ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుందని పేర్కొన్నారు. ఈ సినిమాతో ఆ నమ్మకం మరింత బలపడిందని చెప్పుకొచ్చారు. అందుకే ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరి మాటలు పట్టించుకోవద్దని అన్నారు. మనం పైకి ఎక్కుతుంటే కొందరు కిందకు లాగడానికి ప్రయత్నింస్తుంటారని, కానీ మీరు కష్టపడి, నమ్మకంతో పనిచేయాలని అప్పుడే విజయం వరిస్తుందని చెప్పారు. ఏదైనా సినిమా విడుదల అవుతుంటే సినిమా బాగా ఆడాలని అనుకునేవాళ్లు తక్కువని, ఈ సినిమా పోతుంది చూస్కో అని ముందే సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారని అన్నారు. అలాంటి చెడు మీద ఈ రోజు దసరా గెలిచిందని చెప్పారు. ఈ విజయం తన ఒక్కడిదే కాదని, ‘దసరా’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కిరిదీ అని అన్నారు. 

బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘దసరా’

‘దసరా’ సినిమా విడుదలకు ముందు నుంచే హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. హీరో నాని కూడా ఈసారి ప్రమోషన్స్ లో బాగానే తిరిగారు. అయితే మూవీ విడుదలైన తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదరణ లభించింది. రొటీన్ స్టోరీనే అయినా స్క్రీన్ ప్లే, నాని నటన, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా విడుదల అయిన మొదటి రెండు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు సాధించిందీ ‘దసరా’. ఇక వారం రోజుల్లో వంద కోట్ల కలెక్షన్లు సాధించి నాని ను వంద కోట్ల మార్కెట్ లో నిలబెట్టింది. నాని కెరీర్ లోనే అత్యంత వేగంగా అధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది నాని ‘దసరా’.

Also Read: బాబోయ్! ప్రేమ కోసం రాజశేఖర్‌ను జీవిత బ్రిడ్జి మీది నుంచి తోసేసిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget