
Daaku Rage Lyric Video Promo Out : ‘డాకూ మహారాజ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది - బాలయ్య అంటే తమన్ అస్సలు తగ్గడు, చితక్కొట్టేశాడు
Daaku Maharaaj First Single : డాకూ మహారాజ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ప్రోమో ఎలా ఉందంటే..

Daaku Rage Lyric Video Promo : నందమూరి బాలకృష్ణ తన సినిమాల స్పీడ్ కూడా పెంచేశారు. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ షూటింగ్ కూడా మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యాన్స్ ఫోకస్ అంతా ‘డాకూ మహారాజ్’ పైనే ఉంది. వచ్చే సంక్రాంతికి రాబోతున్న ఈ క్రేజీ సినిమాకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను విడుదల చేస్తూ, ఫ్యాన్స్ లో జోష్ పెంచుతోంది ‘డాకు మహారాజ్’ సినిమా టీమ్.
View this post on Instagram
డాకూస్ రేజ్ !
ఫస్ట్ సాంగ్ ను ఈ డిసెంబరు 14న (శనివారం) రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ప్రోమో ను శుక్రవారం విడుదల చేశారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా లోని మొదటి పాట ‘డాకూస్ రేజ్’ ప్రోమోను ను విడుదల చేశారు మేకర్స్. ‘‘డేగ...డేగ’’ అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్ ను అనంత్ శ్రీరామ్ రచించారు. నకాశ్ అజీజ్ పాడిన ఈ పాట ఇప్పుడు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘డాకు మహారాజ్’ గ్లింప్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. దానికి తమన్ అందించిన బీజీఎంకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
Daaku Maharaj Cast And Crew : బాబీ(కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫోర్చ్యూన్ ఫోర్ స్టూడియోస్ లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య(దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. చాందినీ చౌదరి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
బాలయ్యకు కలిసి వచ్చే సంక్రాంతి
సంక్రాంతి పండగ బాలయ్య బాబుకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘గౌతమి పుత్రశాతకర్ణి’, ‘వీరసింహారెడ్డి’ లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ, ‘డాకు మహారాజ్’ ను సంక్రాంతి బరిలోకి దింపారు. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంటకేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలూ ఉన్నాయి. అలాగే అజిత్ నటించిన ‘విదా మయూర్చి’ అనే తమిళ్ డబ్బింగ్ సినిమా సంక్రాంతి రేసులో ఉంది. అలాగే నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
