మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?
'గుంటూరు కారం' సినిమాకు ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే మాస్ స్ట్రైక్ వీడియోకి ఆయన కంపోజ్ చేసిన ట్యూన్ వేరే సినిమాల నుంచి కాపీ చేసారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్.ఎస్. థమన్ ఒకరు. స్టార్ హీరోల సినిమాలకు, భారీ బడ్జెట్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయిన తమన్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంగీతం సమకూరుస్తూ బిజీగా ఉన్నారు. అద్భుతమైన పాటలతో పాటుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తాడని ఆయనకు పేరుంది. కేవలం తన సంగీతంతోనే ఎన్నో సినిమాలను సక్సెస్ బాట పట్టించాడు కూడా. అందుకే ఆయన మ్యూజిక్ కంపోజర్ గా ఉన్న చిత్రాల ఆడియో రైట్స్ ఓ రేంజ్ లో పలుకుతున్నాయి. అయితే ఎన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్, చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినా థమన్ మీద 'కాపీ క్యాట్' అనే ముద్ర మాత్రం పోవడం లేదు.. నెట్టింట ట్రోల్స్ కు బ్రేక్స్ పడటం లేదు.
ఇటీవల కాలంలో థమన్ కంపొజిషన్ నుంచి ఏదైనా సాంగ్ వస్తుందంటే చాలు, అది కాపీ ట్యూన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మాములైపోయింది. దాని ఒరిజినల్ వెర్సన్ ఇదేనంటూ పాత పాటలను బయటకు తీసి మరీ, సంగీత దర్శకుడిని ట్రోల్ చేయడానికి ఓ వర్గం నెటిజన్స్ రెడీగా ఉంటారు. 'The Man' అంటూ మీమ్స్ చేసి, నెగెటివ్ కామెంట్స్ పెడుతుంటారు. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన 'గుంటూరు కారం' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలోనూ అదే జరుగుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. దీనికి థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. వీరి ముగ్గురి కలయికలో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇది. కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటుగా గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ మాస్ స్ట్రైక్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో థమన్ బీజీఎమ్, త్రివిక్రమ్ లిరిక్స్ మరియు రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ స్పెషల్ గా నిలిచాయి. అయితే సమయంలో ఈ ట్యూన్ ను తమన్ వేరే సినిమాల నుంచి కాపీ కొట్టాడనే ఆరోపణలు కూడా వచ్చాయి.
'గుంటూరు కారం' బ్యాగ్రౌండ్ స్కోర్, 'కణ్మణి రాంబో ఖతీజా' సినిమా కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన 'డిప్ప డపం డిమకు డపం' అనే బీజీఎమ్ ను పోలి ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలానే దేవిశ్రీ ప్రసాద్ 'నాన్నకు ప్రేమతో' మూవీ కోసం స్వరపరిచిన 'లవ్ దెబ్బ' సాంగ్ లోని బీట్ కూడా కలిసుందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఈ మేరకు వీడియోలను ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఫోక్ సాంగ్ బీట్స్ అన్నీ ఇలానే ఉంటాయని, కాపీ కొట్టారని అనడం సరికాదని థమన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే 'గుంటూరు కారం' మాస్ స్ట్రైక్ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 25 మిలియన్లకు పైగా రియల్ టైం వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది. అంతేకాదు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ గ్లిమ్స్ గా ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
Rey teddy https://t.co/G7wOSqMy93 pic.twitter.com/qQkcVEOnHw
— Ponile Mowa (@ponilemova) May 31, 2023
Also Read: షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!