Coolie War 2 Ticket Price: కూలీ, వార్ 2 టికెట్ రేట్లు: ఎన్టీఆర్, నాగార్జున ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వెనక్కి తగ్గిన ప్రభుత్వాలు?
Coolie Vs War 2: ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్న 'కూలీ', 'వార్ 2' సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నారని వచ్చిన వార్తలు ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. దాంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గాయని టాక్

తెలుగులో స్టార్ హీరోలు నటించిన, అగ్ర దర్శకులు తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం అనేది కొన్నాళ్లుగా వస్తున్న ఆనవాయితీ. 'బాహుబలి' నుంచి ఆ ట్రెండ్ మరింత పెరిగింది. 'హరి హర వీరమల్లు' వరకు కంటిన్యూ అయ్యింది. అయితే 'కూలీ', 'వార్ 2'కు టికెట్ రేట్లు పెంచే ప్రయత్నాలు జరిగాయి. ఆ న్యూస్ బయటకు లీక్ కావడంతో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వాలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఎందుకు పెంచాలి!?
'వార్ 2'లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, 'కూలీ'లో కింగ్ అక్కినేని నాగార్జున యాక్ట్ చేశారు. వాళ్లిద్దరూ తెలుగులో సూపర్ స్టార్లు. అయితే ఆ రెండు సినిమాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాదు. 'కూలీ' తమిళ్ సినిమా అయితే 'వార్ 2' హిందీ సినిమా.
డబ్బింగ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ఎంత వరకు సబబు? అని తెలుగు ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. అవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్టు ఉన్నాయి. టికెట్ రేట్లు పెంచుతూ ఎటువంటి జీవో ఇవ్వలేదని సమాచారం. నైజాంలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం లేదని స్పష్టమైన సమాచారం అందుతోంది.
ఏపీలోనూ వెనక్కి తగ్గిన ప్రభుత్వం... నో టికెట్ హైక్?
'కూలీ', 'వార్ 2' సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచకూడదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తమ నిర్ణయాన్ని పునరాలోచించి వెనక్కి తగ్గిందట. ఏపీలోనూ టికెట్ రేట్లు పెరిగే అవకాశాలు లేవని టాక్. ఏపీలో టికెట్ రేట్లు పెరిగినా సరే 50 నుంచి 75 రూపాయలు మాత్రమే పెరిగే అవకాశం ఉందని టాక్. అందువల్ల, నైజాంతో పాటు ఏపీలోనూ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు.
Also Read: ఎన్టీఆర్‌కు గుడి కట్టిన ఫ్యాన్స్... విజయవాడ శైలజా థియేటర్‌లో పూజలు
సాధారణంగా తెలంగాణ మల్టీపెక్స్ స్క్రీన్‌లలో 200 నుంచి 300 వరకు టికెట్ రేటు ఉంటుంది. హైక్ ఇస్తే ఆ రేటు 450 దాటుతుంది. డబ్బింగ్ సినిమాకు ఆల్మోస్ట్ 500 ఎందుకు పెట్టాలనే ప్రశ్న ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఇతర భాషల సినిమాలకు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. అలాగయితే హాలీవుడ్ సినిమాలకు ఎంత పెచుతారని కొందరు ప్రశ్నించారు.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?





















