సాయి తేజ్‌కు ముద్దు పెట్టిన 'కలర్స్' స్వాతి - కాలేజీ రోజుల నుంచి ఇద్దరూ ఫ్రెండ్స్ అంట!
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'మంత్ ఆఫ్ మధు' ట్రైలర్ ని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో సాయి తేజ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు'. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని అందుకోగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తన చేతుల మీదుగా లాంచ్ చేశాడు. ఇందులో భాగంగానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించగా, ఈ ఈవెంట్ లో సాయి తేజ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. "ఈ సినిమా ప్రొడ్యూసర్ యశ్ నా క్లోజ్ ఫ్రెండ్. యశ్ కి ఈ మూవీ ఫస్ట్ థియేటర్ రిలీజ్ అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఏం కంగారు పడొద్దు అని చెప్పాను" అని అన్నాడు.
డైరెక్టర్ శ్రీకాంత్ తీసిన భానుమతి రామకృష్ణ సినిమాలో ఉన్న కాంప్లెక్స్ ఎమోషన్స్ ఈ సినిమాలోనూ ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా కూడా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు కూడా నా స్నేహితుడే. అతనికి కూడా ఆల్ ది బెస్ట్. సినిమాలో హర్ష చాలా బాగా చేశాడని అందరు నాతో చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. యాక్టర్ గా నవీన్ ని చూస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్, డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఓ సినిమాలో విలన్ గా కనిపిస్తాడు. ఇంకో సినిమాలో హీరోగా కనిపిస్తాడు. ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు తాగుబోతుగా నవీన్ యాక్టింగ్ చూసి షాక్ అయ్యా. చాలా బాగా చేశాడు" అని పేర్కొన్నాడు..
ఇక చివరగా స్వాతి గురించి చెప్పాలంటే, మీ అందరికీ కలర్ స్వాతి స్వాతి అంటే నాకు మాత్రం స్వాతి గాడు. ఎందుకంటే మా కాలేజీ రోజుల నుండే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్ స్వాతి లాగా స్టార్ట్ అయ్యి స్వాతి అయింది, ఆ తర్వాత స్వాతి గాడు అయ్యింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ స్వాతి" అని సాయి తేజ్ చెప్పాడు. దాంతో వెంటనే స్వాతి తేజ్ ని హగ్ చేసుకొని ముద్దు పెట్టేసింది.
అనంతరం స్వాతి మాట్లాడుతూ.." అందరికీ నమస్కారం. అందరికీ చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా టీజర్ లో నేను, నవీన్ మాత్రమే కనిపించాం. కానీ చాలామంది స్టార్స్ ఇందులో ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది శ్రేయ గురించి. శ్రేయ సినిమాలో చాలా బాగా నటించింది. తను ఎంత టాలెంటెడో సినిమా చూశాక మీరే చెప్తారు. శ్రేయ తో పాటు హర్ష, దక్షిణ, చైతు, భూషణ్ అందరూ చాలా బాగా చేశారు. ఈరోజుల్లో చాలామంది తెలుగు అమ్మాయిలకి ఆన్ స్క్రీన్ రిప్రజెంటేషన్ లేదు. అలాంటిది ఓ తెలుగు అమ్మాయి అయిన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి థాంక్యూ. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
ఆ తర్వాత సాయి ధరంతేజ్ గురించి మాట్లాడుతూ.." మేమిద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లో నా డెబ్యూ ముందు జరిగింది కాబట్టి నేను తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరిదీ ఒకే ఏజ్. మేమిద్దరం ఓకే కాలేజీలో డిగ్రీ చేసాం. లాస్ట్ వన్ ఇయర్ లో మేమిద్దరం సత్య అనే ఓ ప్రాజెక్ట్ చేశాం. తేజు నా లైఫ్ లో ఎప్పుడూ ఓ సపోర్ట్ సిస్టమ్ లా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు" అంటూ చెప్పుకొచ్చింది స్వాతి.
Also Read : విడాకుల ప్రశ్నకు 'కలర్స్' స్వాతి సమాధానం ఏమిటో తెలుసా? - వైరల్ స్టేట్మెంట్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial