అన్వేషించండి

Chiyaan61: రియల్ కేజీయఫ్‌పై విక్రమ్ నెక్స్ట్ సినిమా - షూటింగ్ ఎప్పటి నుంచంటే?

చియాన్ విక్రమ్ తర్వాతి చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పా.రంజిత్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

చియాన్ విక్రమ్ అభిమానులకు గుడ్ న్యూస్. మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్‌లో ఆదిత కరికాలన్ పాత్రకు ప్రశంసలు పొందిన తరువాత, చియాన్ తన తదుపరి సినిమాకు సంబంధించిన వర్క్ ప్రారంభించాడు. దీనిని ప్రస్తుతానికి #Chiyaan61 అని పిలుస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. రజనీకాంత్ నటించిన ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల దర్శకుడు పా.రంజిత్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్రానికి ముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్‌లోని (కేజీయఫ్) అణగారిన వర్గాలపై రూపొందుతుందని సమాచారం. ఇది బ్రిటీష్ కాలంలో K.G.Fలో పనిచేసిన నిజ జీవిత మైనర్ల కథ నుంచి ప్రేరణ పొందింది. ఈరోజు విక్రమ్ పాత్ర లుక్ టెస్ట్ జరిగింది. విక్రమ్ తన పాత్ర కోసం గడ్డం పెంచుకున్నాడు. మణిరత్నం  పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ సమయంలో అదే విధంగా కనిపించాడు.

చాలా సంవత్సరాలుగా గుర్తింపు, గౌరవం కోసం తహతహలాడుతున్న సమాజం చుట్టూ కథాంశం తిరుగుతుందని చిత్ర దర్శకుడు పా.రంజిత్ అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో బలమైన, స్వతంత్రమైన మహిళ పాత్ర ఉంటుందని, ఇది విక్రమ్ పాత్రకు లవ్ ఇంట్రస్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇదో ఆసక్తికరమైన ప్రపంచం అని రంజిత్ చెప్పారు.

ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. 3డీలో విడుదల అవుతుందని సమాచారం. అక్టోబరు 14న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ప్రారంభించి భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఈలోగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన చియాన్ విక్రమ్ ‘ధృవ నచ్చతిరమ్’ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. విక్రమ్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్, ఆర్.పార్తీబన్, సిమ్రాన్, దివ్యదర్శిని, వినాయకన్, అర్జున్ దాస్, రాధికా శరత్‌కుమార్ వంటి భారీ తారాగణంతో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం. విక్రమ్ నటించిన రెండు సినిమాలు 2022లో థియేటర్లలో విడుదలయ్యాయి. అవే కోబ్రా, పొన్నియన్ సెల్వన్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikram (@the_real_chiyaan)

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget