అన్వేషించండి

Chiranjeevi: మా నాన్న ఇచ్చిన విలువైన బహుమతి అది, మీరే నా టీచర్ - అమితాబ్‌కు మెగాస్టార్ ‘చిరు’ సందేశం

చిరంజీవి తాజాగా తన జీవితంలో తన తండ్రి తనకు ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ అయ్యి.. ఎన్నో లక్షల మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు చిరంజీవి. అయితే ఈమధ్యకాంలో చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. తన ప్రొఫెషనల్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా తను జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకాన్ని కూడా తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు చిరు. అదే తన జీవితంలో తాను అందుకున్న విలువైన గిఫ్ట్ అని చెప్పుకొచ్చారు. తన తండ్రి కొణిదెల వెంకటేశ్వర రావు ఇచ్చిన అమూల్యమైన బహుమతి ఏంటో చిరంజీవి బయటపెట్టారు.

అమితాబ్‌కు చిరు వీడియో మెసేజ్..

ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం, ఒకరికి ఒకరు అభిమానులం అని చెప్పుకోవడం చాలా కామన్. అలాగే చిరంజీవి కూడా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే తనకు ఇష్టమని, అభిమానం అని పలుమార్లు బయటపెట్టారు. అందుకే అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజు సందర్భంగా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ షోకు ఒక స్పెషల్ వీడియో మెసేజ్‌ను పంపించారు చిరు. ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ 15వ సీజన్ నడుస్తుండగా.. ఇంకా అమితాబే దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులోని 43వ ఎపిసోడ్‌లో చిరంజీవి పంపిన స్పెషల్ వీడియో మెసేజ్ ప్లే అయ్యింది.

మాటల్లో చెప్పలేను..

చిరంజీవి పంపిన ఈ వీడియోలో ‘నమస్కారం అమితాబ్ బచ్చన్ గారు. ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బచ్చన్ గారి మీద నాకు ఉన్న ప్రేమను, అభిమానాన్ని కొన్ని పదాల్లో చెప్పమంటే చాలా కష్టం. ఎందుకంటే అమితాబ్ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి నా మాటలే నన్ను ఓడిస్తాయి. 1975 ఆగస్ట్ 22, అది నా పుట్టినరోజు. అప్పుడే నా తండ్రి దగ్గర నుండి నాకు అత్యంత విలువైన బహుమతి లభించింది. అది ఏంటంటే అమిత్ గారు నటించిన ఐకానిక్ సినిమా ‘షోలే’ టికెట్. మీరు ఎప్పుడూ నన్ను ముందుకు నడిపే శక్తిలాగా ఉన్నారు. ఇంక తాజాగా ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాలో నా గురువుగా నటించడానికి పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. నిజం ఏంటంటే స్క్రీన్‌పై మాత్రమే కాదు.. మీరు నాకు ఎల్లప్పుడూ టీచరే. 81వ పుట్టినరోజు శుభాకాంక్షలు అమిత్ గారు. మీరు జీవితాంతం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్’’ అంటూ తన వీడియోను ముగించారు.

‘కల్కి’ నుండి ఫస్ట్ లుక్..

ఆ వీడియో చూసి అమితాబ్ బచ్చన్ ఎంతో సంతోషపడ్డారు. థాంక్యూ చిరంజీవి సార్ అని రిప్లై కూడా ఇచ్చారు. ఇక ‘సైరా నరసింహ రెడ్డి’ తర్వాత అమితాబ్ బచ్చన్ నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘కల్కి’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో బిగ్ బి ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ నుండి విడుదలయిన లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక స్వామిజీ రూపంలో ఆ లుక్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు అసలు సినిమా కథేంటో ప్రేక్షకుల్లో తెలుసుకోవాలనే ఆసక్తిని కూడా పెంచేసింది.

Also Read: అందుకే నన్ను మళ్ళీ పిలిచారు - ఈడీ విచారణపై క్లారిటీ ఇచ్చిన నవదీప్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget