అన్వేషించండి

Chiranjeevi : చిరంజీవి దగ్గరకు థియేటర్స్ ఇష్యూ… మెగా మీటింగ్, పెద్ది గురించి దిల్ రాజు ఏమన్నారంటే?

Chiranjeevi Reaction : థియేటర్స్ పర్సంటేజీ అంశం మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఎగ్జిబిటర్స్, నిర్మాతల వెర్షన్ విన్న చిరు... కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Chiranjeevi Reaction On Exhibitors Distributors Producers Issue : సింగిల్ స్క్రీన్స్‌కు పర్సంటేజీ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్స్ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది రిలీజ్ ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సంక్షోభంపై తెలంగాణ ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్లు.... ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో పాటు నిర్మాతలు కేఎల్ నారాయణ, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

చిరు ఏమన్నారంటే?

చిరంజీవితో దాదాపు గంటకు పైగా ఎగ్జిబిటర్స్, నిర్మాతలు ఈ అంశంపై చర్చించారు. తమ సమస్యలను ఎగ్జిబిటర్స్ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో భాగంగా ఉన్న వారందరికీ పూర్తి న్యాయం జరిగేలా ఉండాలని... ఇది ఒక్క పెద్ది సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో చర్చ కాదని అన్నారు. 'పర్సంటేజీ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఏదో ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలి. రాబోయే చిత్రాలకు ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.' అని అన్నట్లు తెలుస్తోంది.

'అది కరెక్ట్ కాదు'

అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే పరిశ్రమ కొన్ని పద్ధతులు ఏర్పరుచుకుందని... ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అందరికీ సముచితమని అన్నారు చిరు. 'పర్సంటేజ్ మోడల్‌పై ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ... మీడియా ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తపరచడం తగదు. ఇలాంటి వాటి వల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న  సందేశం ఇవ్వకూడదు.

ఇంతకు ముందు వేరే కమిటీల పని తీరు, నిర్ణయాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యుల్లో కొంత అసంతృప్తి ఉందన్న విషయం అర్థమైంది. ఈసారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ జూన్ 30 వరకూ అన్నీ విషయాలు పూర్తిగా పరిశీలించి... ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా ప్రతిపాదన చేస్తుందనే నమ్మకం ఉంది. ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తా.' అంటూ హామీ ఇచ్చారు చిరు.

Also Read : మళ్లీ ఛాన్స్ ఇస్తే నటిస్తా - చిరు ఆపద్బాంధవుడు ఫేం మీనాక్షి శేషాద్రి... 30 ఏళ్ల తర్వాత

రెండు రోజుల్లో...

రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని TFDC ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. 'పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్స్ అన్నీ విషయాలు చిరంజీవి గారికి వివరించారు. వారం కిందట ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానని చెప్పారు. రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ విషయాలను ఛాంబర్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.' అని అన్నారు.

ఈ మీటింగ్‌లో TFCC ప్రెసిడెంట్ శ్రీ సురేష్ బాబు, అల్లు అరవింద్, TFDC ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : రియల్ ఒకే ఒక్కడు సీఎం విజయ్ - పొలిటికల్ ఎంట్రీపై హీరో అర్జున్ రియాక్షన్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత స్టడీగా 'చెన్నై లవ్ స్టోరీ' కలెక్షన్లు... ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ఓవర్సీస్‌లో 50 లక్షలే... మరి తెలుగు రాష్ట్రాల్లో? ఐదు రోజుల్లో 'చెన్నై లవ్ స్టోరీ' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Kalatheylaa Song Lyrics: కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
కలతేలా లిరిక్స్... మధ్యతరగతి భర్తకు మోటివేషన్ ఇచ్చేలా విశాల్ 'మకుటం'లో సాంగ్
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
రామ్ చరణ్ సర్జరీ తర్వాత ఫస్ట్ ఫోటో... హాస్పిటల్ బెడ్‌పై నుంచి
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget