(Source: ECI/ABP News/ABP Majha)
Acharya Chiranjeevi: చిరంజీవి లెక్క తప్పింది, రాజమౌళి సెంటిమెంట్ ఎఫెక్ట్ ఆయనకూ తప్పలేదు!
రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు, ఆ తర్వాత ఫ్లాప్స్ తప్పవని ఒక సెంటిమెంట్ ఉంది. అది తప్పని 'ఆచార్య 'తో ప్రూవ్ అవుతుందని చిరంజీవి చెప్పారు. కానీ, ఆయన లెక్క తప్పింది.
'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశారా? దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి శాలువాతో సత్కరించారు. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు సినిమాకు రాజమౌళి గౌరవం తీసుకు వచ్చారని గొప్పగా చెప్పారు. అలాగే, రాజమౌళితో సినిమా చేసి విజయం అందుకున్న హీరోలకు ఆ తర్వాత పరాజయం తప్పదనే విషయాన్ని కూడా ప్రస్తావించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని సినిమా జనం బలంగా నమ్ముతారు. రాజమౌళితో సినిమా చేస్తే సూపర్ డూపర్ హిట్ గ్యారెంటీ అనేది ఎంత నిజమో, రాజమౌళి సినిమా తర్వాత ఎవరితో సినిమా చేసినా హీరో ఫ్లాప్ అందుకోవడం పక్కా అనేది కూడా అటువంటి సెంటిమెంట్స్‌లో ఒకటి. 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అది తప్పని తమ సినిమా ప్రూవ్ చేస్తుందని చిరంజీవి చెప్పారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. కట్ చేస్తే... ఎవరూ ఊహించని విధంగా 'ఆచార్య'కు నెగెటివ్ టాక్ వచ్చింది. థియేటర్స్ దగ్గర రెస్పాన్స్ కూడా బాలేదు. మెగా ఫ్యాన్స్ సైతం సినిమా చూశాక పెదవి విరుస్తున్నారు. దాంతో సినిమా ఫ్లాప్ అని చాలా మంది డిసైడ్ అవుతున్నారు.
'ఆచార్య' రిజల్ట్ ఏంటనేది తెలిసిన తర్వాత రాజమౌళి సెంటిమెంట్ విషయంలో మాత్రమే కాదు, సినిమా విషయంలో కూడా చిరంజీవి లెక్క తప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన సినిమా 'ఆచార్య'. ఇది ఫ్లాప్ అయ్యింది. రాజమౌళి సెంటిమెంట్ ఎఫెక్ట్ రామ్ చరణ్‌తో పాటు సినిమాలో నటించిన చిరంజీవి మీద కూడా పడింది.
Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.